‘నంది అవార్డులకు కావాల్సిన వారి ఎంపిక’

17 Nov, 2017 19:36 IST|Sakshi

నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం

కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు సాగదీత

సాక్షి, మడకశిర: ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం ఇప్పుడే ఆగేట్లు కనిపంచడం లేదు. ఈ నంది అవార్డులపై తాజాగా పీసీసీ చీఫ్‌ ఎన్‌. రఘువీరారెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని పీసీసీ చీఫ్‌ విమర్శించారు. ఆయన శుక్రవారం తన స్వగ్రామమైన నీలకంఠపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండటం తగదన్నారు. ప్రభుత్వం నంది అవార్డులకు కావాల్సిన వారిని ఎంపిక చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం సాగదీస్తోందని విమర్శించారు. పోలవరం పనుల్లో వేగవంతం లేదని ఆయన అన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం తప్పిదం వల్లే బోటు ప్రమాదం జరిగిందని విమర్శించారు. ఈ ప్రమాద సంఘటనపై ప్రజలను దృష్టి మళ్లించేందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులను తీసుకెల్లి షుటింగ్‌ తరహాలో ప్రభుత్వం వ్యవహరించదన్నారు. 

ఈ నంది అవార్డులపై ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను తెలిపిన విషయం తెలిసిందే. కొంత మంది ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. కొందరు  అయితే సోషల్‌​ మీడియా ద్వారా అవార్డులపై చెలరేగిపోతున్నారు. దర్శకత నిర్మాత గుణశేఖర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వాన్ని, నంది అవార్డుల జ్యూరీపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రతి విషయంపై స్పందించే డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ఫెస్‌బుక్‌ ద్వారా నంది అవార్డులపై తీవ్ర విమర్శలు చేశారు.

>
మరిన్ని వార్తలు