ఓటు హక్కును వినియోగించుకోని పాలమూరు కూలీలు

12 Apr, 2019 12:56 IST|Sakshi
జడ్చర్ల–కోదాడ రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న కూలీలు

సాక్షి, పెద్దవూర: తెలుగు రాష్ట్రాలలో మొదటి విడతలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు పాలమూరు కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు జిల్లాలకు చెందిన వందలాది మంది జడ్చర్ల–కోదాడ రోడ్డు విస్తరణ పనులలో కూలీ పనులు చేస్తున్నారు. వీరిని సంబందిత కాంట్రాక్టర్‌ నెలవారీ వేతనంతో కుటుంబాలకు, కుటుంబాలే జీతం చేస్తున్నారు. వీరి స్వగ్రామాలలో గురువారం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా ఓటు హక్కును వినియోగించుకోలేని దీన పరిస్థితిలో ఉన్నారు. తాము కేవలం సర్పంచ్‌ ఎన్నికల సమయంలోనే మా స్వగ్రామమైన దేవరకద్రకు వెళ్లి ఓట్లు వేసినట్లు, శాసనసభ ఎన్నికల్లోనూ ఇక్కడే ఉండి కూలీ పనులు చేసినట్లు తెలిపారు. ఓటు వేయటానికి ఊరికి వెళ్తే ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు అవుతుందని, దీనికి తోడు పనికి రాకుంటే నాకాలు వేస్తారని దీనంగా పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు