ఆంధ్రజ్యోతి నిరాధార వార్తలను ప్రచురించడం సరికాదు
ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
వివరణ ఇవ్వకున్నా.. ఆధారాలు
చూపకున్నా పరువునష్టం దావా
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం
సాక్షి, తిరుపతి తుడా: తూర్పుగోదావరి జిల్లాలోని లేటరైట్ నిక్షేపాల నమూనాలను కెమికల్ అనాలసిస్‌కు పంపామని.. అందులో అల్యూమినియం ఉన్నట్లు తేలడంతో తిరిగి లీజు నిర్వాహకులకే అనుమతులను పునరుద్ధరించామని రాష్ట్ర గనులు, భూగర్భ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. బాక్సైట్‌కు అయితే కేంద్రమే అనుమతులిస్తుందని ఆయనన్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక నిరాధారమైన ఆరోపణలతో ‘ఏటా రూ.180 కోట్లు’ స్వాహా చేస్తున్నట్లు అసత్య కథనాన్ని ప్రచురిం చిందని ఆయన మండిపడ్డారు. 2012లో అప్పటి ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లాలో తొమ్మిది మందికి 2033 వరకు ఈ లేటరైట్ నిక్షేపాల తవ్వకాలకు అనుమతులిచ్చారని మంత్రి తెలిపారు. తిరుపతిలోని తన నివాసంలో పెద్దిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..