ప్రజల గుండెల్లో వైఎస్సార్‌: జీవన్‌రెడ్డి

9 Jul, 2018 01:36 IST|Sakshi

జగిత్యాల టౌన్‌: ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలుగు ప్రజలకు ఇప్పటికీ మేలు చేస్తూనే ఉన్నాయని గుర్తుచేశారు. ఆదివారం వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాకేంద్రంలోని ఆయన స్వగృహంలో వేడుకలను  నిర్వహించారు.

వైఎస్సార్‌ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చిన మహానీయుడన్నారు. కాగా, నల్లగొండ జిల్లా నార్కట్‌ పల్లిలో కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైఎస్‌కు నివాళులర్పించారు. 

మరిన్ని వార్తలు