బాబు పాలనలో అన్నీ కష్టాలే

16 Mar, 2018 03:05 IST|Sakshi
పొన్నూరు శివారులో పాదయాత్ర సాగిస్తున్న వైఎస్‌ జగన్‌

ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌ ఎదుట వాపోయిన రైతులు, రైతు కూలీలు

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఏ పంటకూ గిట్టు బాటు ధర లేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఇలాగైతే తామెలా బతకాలని పలువురు రైతులు, రైతు కూలీలు ఏపీ ప్రతిపక్ష నేత ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. చంద్ర బాబు నాలుగేళ్ల పాలనలో అన్నీ కష్టాలే అని, అన్ని విధాలుగా నష్టపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు సీఎం అయితేనే తమ బతుకులు బాగుపడతాయన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో 113వ రోజు ప్రజా సంకల్ప యాత్ర సాగించారు. దారిపొడవునా రైతులు, ఉద్యోగులు, కూలీలు, వివిధ సంఘాల నేతలు ఆయనకు కష్టాలు చెప్పుకున్నారు.

బాబు పాలనలో ఒక్క హామీ కూడా నెరవేరక ఇక్కట్లు పడుతున్నామని వివ రించారు. వల్లభనేనివారి పాలెం  గ్రామానికి చెందిన మాగులూరి నాగమణి అనే మహిళా రైతు మినుము పంటకు గిట్టుబాటు ధర లేదని వాపోయింది. దీంతో అప్పులపాలయ్యానని, ఉన్న అప్పులు మాఫీ కాక, కొత్త అప్పులు పుట్టక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పింది. వ్యవసాయం వదిలేసి కూలీకి పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అందరి సమస్యలను ఓపికగా విన్న జననేత.. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని విధాలా ఆదుకుం టామని భరోసా ఇచ్చారు. పేదల చదువు కోసం ఎన్ని లక్షల రూపా యలు ఖర్చయినా భరిస్తామని చెప్పారు. నవరత్నాలతో అందరికీ మేలు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు