వేయి అడుగుల రేడు

30 Jan, 2018 07:13 IST|Sakshi
విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరణ

వేదికైన సైదాపురం

విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరణ

పోటెత్తి వచ్చిన ప్రజలు

గూడూరు నియోజకవర్గంలో ముగిసిన ప్రజాసంకల్ప యాత్ర

వెంకటగిరి నియోజకవర్గంలోకి ప్రవేశం

12.5 కి.మీ. నడిచిన జననేత జగన్‌

అలుపెరగని పాదచారిసలుపన్నది లేదు మరినీకెవ్వరు లేరు సరిపూరించిన వీరుని శంఖస్వరివేల గొంతుకల విప్లవ ఝరిప్రతి ఊరూ నీ అనుసరిఅరాచక పాలనపై వాక్‌‘ధాటి’ఆపన్నుల పాలిట ఆత్మీయ పూదోటి
సుఖాలను త్యజించిన సెలబ్రిటీవిశ్వసనీయత, నమ్మకంలో నీకెవరు సాటిసంక్షేమం, అభివృద్ధి వైపు నడపాలనేసంకల్పంతోటి.. ఆప్తుడవైనావుప్రజాహృదయాల వీణను మీటికష్టాలు ఈడేర్చ సహస్ర బాహువై
ప్రజాకంటక పాలనపై చర్నకోలవైఈ పాలకుల పీచమణచగవేయి అడుగుల రేడువైమరిన్ని అడుగులు ముందుకెయ్‌

ప్రజాసంకల్ప యాత్రలో సోమవారం చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రజా సమస్యల పరిష్కారం.. వారి సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర వేయి కిలోమీటర్ల మైలురాయి దాటింది. ఇడుపులపాయ నుంచి మొదలైన పాదయాత్ర.. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురం వద్ద చరిత్రను లిఖించింది.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: చారిత్రక ఘట్టానికి నెల్లూరు జిల్లా వేదికైంది. అలుపెరుగని ప్రజాసంకల్ప యాత్రికుని పాదయాత్ర జిల్లాలో కీలక మైలురాయిని దాటిన ఘట్టం సోమవారం ఆవిష్కృతమైంది. ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర రాయలసీమ నాలుగు జిల్లాల్లో ముగించుకుని కోస్తాలోని నెల్లూరు జిల్లాకు చేరింది. వెంకటగిరి నియోజకవర్గం పరిధిలోని సైదాపురంలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని వైఎస్‌ జగన్‌ అధిగమించారు. సోమవారం ఉదయం గూడూరు నియోజకవర్గంలోని నిమ్మకాయల మార్కెట్‌ సెంటర్‌లో ప్రారంభమైన ప్రజాసంకల్ప యాత్ర సాయంత్రం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురంలో ముగిసింది. జిల్లాలో మూడో నియోజకవర్గంలోకి యాత్ర అడుగిడింది. సోమవారం 12.5 కిలోమీటర్ల మేర జననేత యాత్ర కొనసాగించారు.

అడుగడుగునా బ్రహ్మరథం
పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పలువురు తమ కష్టాలు, సమస్యలను వైఎస్‌ జగన్‌కు విన్నవించి భరోసా పొందారు. మద్దాలి పద్మమ్మ అనే గృహిణి ఆరేళ్ల తన కుమారుడు మూగ, చెవుడుతో బాధపడుతున్నాడని, గతేడాది ముఖ్యమంత్రిని కలిస్తే దీనికి ఎన్టీఆర్‌ వైద్యసేవ వర్తించదని చెప్పారని వాపోయింది. తమకున్న 20 సెంట్ల భూమిని అమ్మి వైద్యం చేయించినా సరికాలేదని, హైదరాబాద్‌లో చూపిస్తే రూ.9 లక్షలు ఖర్చవుతుందని చెప్పారని వివరించింది. చెరువుకట్ట సెంటర్‌లో స్థానిక గిరిజనులు జననేతను కలిసి సమస్యలను విన్నవించారు. అక్కడ నుంచి నేలటూరు చేరుకున్న జగన్‌కు ఘనస్వాగతం లభించింది. కామాక్షితాయి సెంటర్‌లో భవాని, రాజేశ్వరి మాట్లాడుతూ తమ గ్రామంలో కనీస సౌకర్యాలు లేవని, పాలకులు తమను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ నుంచి గోగినేనిపురం చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు ఎదురేగి పలికారు. అందరినీ పలకరిస్తూ.. ఆత్మీయ కరచాలనం చేస్తూ యాత్ర సాగించారు.

చెన్నూరులో తోరణాలు
చెన్నూరు గ్రామ ప్రజలు ప్రజాసంకల్ప పాదయాత్రకు అఖండ స్వాగతం పలికారు. గ్రామంలో శుభకార్యం జరిగిన తీరుగా రోడ్డుకు ఇరువైపుల మామిడి, పూలతో తోరణాలు కట్టి రోడ్లపై పుష్పాలు చల్లి తివాచీ పరిచారు. దళితవాడకు చెందిన మల్లంటి సంధ్య జగన్‌ను కలిసి తమకు మరుగుదొడ్లు లేవని తెలిపింది. అధికారులు మాత్రం జిల్లాలో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించినట్లు చెబుతున్నారని తెలిపింది. దళితవాడ సమీపంలో ఇటుకుల బట్టీల్లో పనిచేస్తున్న కూలీలు జగన్‌ను కలిసి కార్మిక చట్టాలు అమలుకాకపోవడం వల్ల అన్నివిధాలా నష్టపోతున్నామని వాపోయారు. మీరు అధికారంలోకి వచ్చాక న్యాయం చేయాలంటూ విన్నవించారు. ఎర్రోడుగుంటకు చెందిన విజయమ్మ తన 13 ఏళ్ల మనుమరాలు సుమను తీసుకొచ్చి.. ఆమె మానసిక స్థితి సరిగా లేదని.. సదరం క్యాంపు ద్వారా సర్టిఫికెట్‌ తీసుకొని పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నా అందలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ నుంచి చెన్నూరు స్కూల్‌ సెంటర్‌కు చేరుకోగా.. మహిళలు, పాఠశాల చిన్నారులు జననేతను చూసేందుకు పెద్దఎత్తున బారులు తీరారు. కరచాలనం చేసేం దుకు పోటీపడ్డారు. అక్కడ నుంచి కట్టాలమ్మ గుడి సెంటర్‌ చేరుకున్న జగన్‌ అక్కడ మహిళలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం తిక్కవరపుపాడు సెంటర్‌కు చేరుకున్న ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు.

విజయ సంకల్ప స్థూపం ఆవిష్కరణ
వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలం కైవల్య నది సమీపంలో నియోజకవర్గ నేతలు, ప్రజలు వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి తూర్పుకొండ్ల క్రాస్‌కు చేరుకున్న ఆయనకు ఎదురేగి స్వాగతించారు. అనంతరం విజయ సంకల్ప స్థూపం వద్దకు చేరుకున్న జననేతకు అశేష జనవాహిని అపూర్వ స్వాగతం పలికింది. ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిన సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విజయ సంకల్ప స్థూపాన్ని జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం కేపీఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఆరు అంబులెన్స్‌లను జననేత ప్రారంభిం చారు. అనంతరం జనవాహినితో కలిసి బస్టాండ్‌ సెంటర్, హాస్పిటల్‌ మీదుగా రాపూర్‌ క్రాస్‌రోడ్డు, ఎంపీడీఓ కార్యాలయం  వరకు పాదయాత్ర కొనసాగించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, డాక్టర్‌ వెలగపల్లి వరప్రసాద్, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కర్నూలు ఎంఎల్‌సి గంగుల ప్రభాకర్‌రెడ్డి,  జెæడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైఎస్‌ జగన్‌కు రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్ప యాత్ర కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళి, పార్టీ నేతలు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు