అనితర సాధ్యం

11 Jun, 2018 07:52 IST|Sakshi
చంద్రవరంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి ,ఏలూరు : ‘పచ్చని పల్లెసీమలకు అలవాలమైన పశ్చిమ.. వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రతో పరవశిస్తోంది. జననేత పల్లెల్లోంచి వెళ్తుంటే.. జయజయధ్వానాలు పలుకుతూ.. ప్రజలు ఆయన వెంట కదులుతున్నారు. తమ అభిమాన నేత కోసం గంటల తరబడి నిరీక్షించి ఘన స్వాగతం పలుకుతున్నారు. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. కష్టసుఖాలు చెప్పుకుని స్వాంతన పొందుతున్నారు. తమ కష్టాలు తీర్చే వెలుగుదివ్వె ఆయనేనని విశ్వసిస్తున్నారు. 

యాత్ర సాగిందిలా..
వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఆదివారం ఉదయం 8.45 గంటలకు నిడదవోలు నియోజకవర్గం దారవరం నుంచి ప్రారంభమైంది. మార్కొండపాడు గ్రామం వద్ద కొవ్వూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తానేటి వనిత ఆధ్వర్యంలో ప్రజలు ఎదురేగి వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రవరం మీదుగా పాదయాత్ర ముందుకు కదిలింది. మల్లవరంలో బీసీలతో వైఎస్‌ జగన్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం  గౌరిపల్లి వరకూ యాత్రను కొనసాగించారు. దారిపొడవునా ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలు విన్నారు. నేనున్నానని ధైర్యం చెప్పారు. రాజన్న రాజ్యం ఎంతో దూరంలో లేదని భరోసా ఇచ్చారు.  గౌరిపల్లిలో వైఎస్‌ జగన్‌ రాత్రి శిబిరానికి చేరుకున్నారు.

ముస్లింల ఇఫ్తార్‌ విందు
దారవరం, సమిశ్రగూడెం, నిడదవోలు ముస్లిం నేతలు షరీష్, ఆక్రం, సమీర్‌ రహమాన్‌ నేతృత్వంలో ముస్లింలు గౌరిపల్లిలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. జగన్‌ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

వైఎస్‌ జగన్‌కు వినతుల వెల్లువ  
యాత్ర పొడవునా వైఎస్‌ జగన్‌కు వినతులు వెల్లువెత్తాయి. ఏపీ రాష్ట్ర స్టోన్‌ క్రషర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పద్మనాభరావు వైఎస్‌ జగన్‌               మోహన్‌రెడ్డిని మార్కొండపాడులో కలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ విధానాలతో ఇబ్బంది పడుతున్నామని జననేతకు చెప్పారు. ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ సమస్యలు, విద్యుత్‌ బిల్లుల భారం గురించి వివరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ చాగల్లు కార్యదర్శి ఏవీ కృష్ణారావు  వైఎస్‌ జగన్‌ను కలిసి  సమస్యలు వివరించారు. వాహనాల ఇన్సూరెన్స్‌లు కట్టుకోవటం కష్టంగా మారిందని, డీజిల్‌ ధరలు ఒక్కనెలలోనే రూ.10 మేర పెరిగిపోవటంతో నష్టాల్లో కూరుకుపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మూడు నెలల ట్యాక్స్‌ రూ.3,200 ఉంటే, ఇప్పుడు రూ.3,350కి పెంచేశారని, ఇతర పన్నులు, స్పీడ్‌ గవర్నెన్స్‌ పేరుతో భారీగా దోపిడీ చేస్తున్నారని జగన్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నొస్తున్నాడు పాటల సీడీ ఆవిష్కరణ
పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన షెహెన్‌షా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు సంబంధించి ‘అన్నొస్తున్నాడు’ పాటల సీడిని రూపొందించాడు. ఈ సీడీని వైఎస్‌ జగన్‌ మార్కొండపాడులో ఆవిష్కరించారు. షెహెన్‌షా మాట్లాడుతూ.. తన తల్లికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో గుండె ఆపరేషన్‌ చేయించారని, ఆయన కుటుంబమంటే తనకు అభిమానమని పేర్కొన్నారు. 

పాదయాత్రకు పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు, కొవ్వూరు సమన్వయర్త తానేటి వనిత, నిడదవోలు సమన్వయకర్త జి.శ్రీనివాస నాయుడు, భీమవరం సమన్వయకర్త గ్రంధి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం సమన్వయకర్త కొట్టు సత్యనారాయణ, తణుకు సమన్వయకర్త కారుమూరి నాగేశ్వరరావు, గోపాలపురం సమన్వయర్త తలారి వెంకట్రావు,  మాజీ ఎమ్మెల్యే జీఎస్‌ రావు, రాష్ట్ర కార్యదర్శులు రాజీవ్‌కృష్ణ, కవురు శ్రీనివాస్, పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ విభాగం అ«ధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత, మాజీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, కోడూరు శివరామకృష్ణ,  ఉభయగోదావరి జిల్లాల మహిళా విభాగం సమన్వయకర్త పిల్ల్లంగోళ్ల శ్రీలక్ష్మి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు,  పార్టీ నాయకులు కొఠారు రామచంద్రరావు,  ప్రసాద్, కారుమంచి రమేష్, బూరుగుపల్లి సుబ్బారావు, కమ్మ శివరామకృష్ణ, మంతెన యోగేంద్రబాబు, కరిబండి గనిరాజు, ఆత్కూరి దొరయ్య అనంతపురం శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు