‘చంద్రబాబు సెలవు తీసుకునే టైం వచ్చింది’

22 Mar, 2019 18:35 IST|Sakshi

జంగారెడ్డి గూడెం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని, ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్‌ సీపీ నేత తెల్లం బాలరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం పోలవరం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బాలరాజు నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమన్నారు. పోలవరం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా తాను భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ ముఖ్యమంత్రి అవటం ఖాయమని జోష్యం చెప్పారు.

చంద్రబాబు సెలవు తీసుకునే టైం వచ్చింది
ఆచంట : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెలవు తీసుకునే టైం వచ్చిందని, ప్రజలు కూడా బాబుని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌ సీపీ నేత రంగనాథరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆచంట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగనాథ రాజు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పితాని సీఎం చంద్రబాబులు ఆచంట నియోజకవర్గ ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్‌ సీపీని ఆశీర్వదించాలని, ఆచంట ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నిడదవోలు :  నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా  జి. శ్రీనివాస నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు.  నిడదవోలు నియోజకవర్గ 3 మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లున, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు