పసుపు కుంకుమ నిలిపివేయాలంటూ పిటీషన్‌

4 Apr, 2019 16:29 IST|Sakshi

ఢిల్లీ హైకోర్టులో స్వచ్ఛంద సంస్థ పిటీషన్‌

న్యూఢిల్లీ : ప్రభుత్వ పథకాల పేరిట ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయటాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పసుపు-కుంకుమ పథకం పేరిట చెక్‌ల రూపంలో ఓటర్లను ప్రలోభపెడ్తుందని, ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఈ నగదు బదిలీని ఆపాలని జనచేతన వేదిక అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌పై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. పసుపు-కుంకమ పథకం అమలు విషయమై పూర్తి వివరాలు అందించాలంటూ హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 5కు వాయిదా వేసింది. ఇక ఏపీ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభపెట్టేవిధంగా పసుపు కుంకుమ, అన్నధాత సుఖీభవ, పెన్షన్ల పెంపు పథకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 


 

మరిన్ని వార్తలు