జిగ్నేశ్‌పై పిడమర్తి ఫైర్

18 Jan, 2018 16:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దళితుల గురించి మాట్లాడే అర్హత గుజరాత్‌ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీకి లేదని తెలంగాణ ఎస్సీ కార్పొషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గుజరాత్‌లో దళిత ఉద్యమాన్ని కాంగ్రెస్‌ పార్టీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందన్న జిగ్నేశ్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌తో ఆయన సమావేశం కావడాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. మంద కృష్ణమాదిగ జైల్లో ఉన్నా ఎస్సీ వర్గీకరణ పోరాటం ఆగదని పిడమర్తి రవి స్పష్టం చేశారు.

కాగా, చంచల్‌గూడ జైల్లో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను జిగ్నేశ్‌ మేవానీ బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ కుట్ర పన్ని మంద కృష్ణను జైల్లో పెట్టాయని, అక్రమ కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు