‘బాబు పాలనలో 150 రహస్య జీవోలు ఇచ్చారు’

22 Jan, 2020 11:49 IST|Sakshi

సాక్షి, అమరావతి : సాంకేతిక సమస్య వల్లే మండలి ప్రత్యక్ష ప్రసారాలకు అంతరాయం ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పారు. ప్రత్యక్ష ప్రసారాలను ఇద్దరు మంత్రులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. టీవీ ప్రసారాలను ఆపే సంస్కృతి టీడీపీ నాయకులదేనని అన్నారు. టీడీపీ పాలనలో 150 రహస్య జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. బిల్లులపై చర్చలను అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోతే.. రాజ్యాంగ సంక్షోభం వచ్చినట్లుగా టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఎద్దేవా చేశారు. బిల్లులపై సజావుగా చర్చ కొనసాగించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యక్ష ప్రసారాల విషయంలో.. సాంకేతిక సమస్య పరిష్కారానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.
(చదవండి : ఏ ఎమ్మెల్సీని బెదిరించానో నిరూపించండి)

రెండు బిల్లులు.. 3 గంటల చర్చ
వాయిదా అనంతరం తిరగి ప్రారంభమైన శాసనమండలిలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులపై చర్చ ప్రారంభమైంది. ఈ రెండు బిల్లులపై మూడు గంటలపాటు చర్చించాలని మండలి నిర్ణయించింది. ఒక్కొక్క సభ్యుడికి మూడు నిముషాల పాటు మాట్లాడేందుకు వైస్ చైర్మన్ అవకాశమిచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులకు 27 నిమిషాలు, టీడీపీ సభ్యులకు 84 నిమిషాలు, గవర్నర్‌ నామినేట్ చేసిన సభ్యులకు 24 నిమిషాలు, పీడీఎఫ్‌ సభ్యులకు 15 నిమిషాలు, బీజేపీ సభ్యులకు 6 నిముషాలు, స్వతంత్ర సభ్యులకు 9 నిమిషాలు కేటాయిస్తున్నట్టు వైఎస్‌ చైర్మన్‌ వెల్లడించారు. అవసరమైన పక్షంలో మరో గంటపాటు అదనంగా చర్చిద్దామని ఆయన స్పష్టం చేశారు.
(చదవండి : బిల్లులపై మండలిలో రగడ)

మరిన్ని వార్తలు