మోదీ ప్రసంగమంతా డొల్లే: కాంగ్రెస్‌

16 Aug, 2018 03:34 IST|Sakshi
రణ్‌దీప్‌ సూర్జేవాలా

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం అసలు విషయం లేకుండానే డొల్లగా సాగిందని కాంగ్రెస్‌ విమర్శించింది. మోదీ ఈసారైనా నిజాలు మాట్లాడి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా స్పందిస్తూ.. ‘దేశ ప్రజలకు ఉపయోగపడే ఒక్క విషయాన్నీ మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. ప్రజలు బీజేపీ చెబుతున్న బూటకపు అచ్ఛేదిన్‌(మంచి రోజులు)తో విసిగిపోయారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే సచ్చే దిన్‌(నిజమైన రోజులు) కోసం వారు ఎదురుచూస్తున్నారు’ అని విమర్శించారు. 2013లో ఛత్తీస్‌గఢ్‌లో ఎర్రకోట తరహాలో ఏర్పాటు చేసిన నిర్మాణం నుంచి మోదీ ప్రసంగిస్తూ.. ప్రభుత్వ అవినీతి, చైనా, పాకిస్తాన్‌ల చొరబాట్లు, రూపాయి పతనం, నిరుద్యోగిత తదితర అంశాల్లో చర్చకు రావాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సవాలు విసిరారని సూర్జేవాలా గుర్తుచేశారు. అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఇదే అంశాలపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు