అమ్మ చనిపోయాక మోదీనే ‘నాన్న’

9 Mar, 2019 16:12 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత రాష్ట్ర ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ తండ్రిలా ఆదరిస్తున్నారని ఆ రాష్ట్ర మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యానించారు. అమ్మలేని (జయలలిత) తమ పార్టీకి మోదీ తండ్రిలా వ్యవహరిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వమంతా మోదీ అదేశాల మేరకే పనిచేస్తోందని, ఆయన దేశానికి కూడా తండ్రిలాండి వాడని మంత్రి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తుపై  ఓ విలేకరి ప్రశ్నకు ఆయన ఈ విధంగా జవాబిచ్చారు. కాగా జయలలిత మరణాంతరం సంభవించిన అనేక పరిణామాల వెనుక బీజేపీ హస్తముందని విపక్షాలు అనేకసార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

బీజేపీతో పొత్తు వద్దు
రజనీకాంత్‌పై అన్నాడీఎంకే ఫైర్‌
శశికళను జైలుకు పంపడం, పళనిస్వామి, పన్నీరు శెల్వం మధ్య ఏకాభిప్రాయం కుదర్చడంలో కేంద్ర ప్రభుత్వం పెద్దల హస్తముందని ఆమధ్య వార్తలు గట్టిగానే వినిపించాయి. ఆ సందేహాలన్నింటికీ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సమాధానం చెప్పకనే చెప్పారు. ఇదిలావుండగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఏంకే మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 39 సీట్లకుగాను బీజేపీ ఐదు స్థానాలకు, పీఎంకే ఆరు స్థానాలకు పోటీ చేసేందుకు అవగాహన కుదిరింది. మిగతా అన్ని స్థానాలకు ఏఐఏడిఎంకేనే పోటీ చేస్తుందని ఇటీవల ప్రకటించింది.


 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు