ముందస్తు అంటే..భయమేస్తోంది: పోచారం

7 Sep, 2018 11:06 IST|Sakshi
పోచారం శ్రీనివాస రెడ్డి

బాన్సువాడ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటే కొన్ని పార్టీలకు భయమేస్తోందని తాజా, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శ్రీనివాస రెడ్డి విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100 శాతం పూర్తి చేసి, ఇ‍వ్వని హామీలను కూడా పూర్తి చేస్తోందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 105, 106 సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ప్రజలకు తమపై విశ్వాసంపై ఉందని, మాకు కూడా ప్రజలపై విశ్వాసం ఉందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు