భట్టి దీక్ష భగ్నం, నిమ్స్‌కు తరలింపు

10 Jun, 2019 08:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు సోమవారం ఉదయం భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా నిమ్స్‌కు తరలించారు. భట్టి విక్రమార్క బీపీ, షుగర్‌ లెవల్స్, ఎర్ర రక్తకణాలు పడిపోవడంతో తక్షణమే వైద్యం అందించాలని ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. దీంతో పోలీసులు ...ఆయనను అరెస్ట్‌ చేసి ఆస్పత్రికి తరలించగా, వైద్యం చేయించుకునేందుకు భట్టి నిరాకరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు