ఆయన వద్దు బాబోయ్‌.. 

23 Mar, 2019 08:03 IST|Sakshi

రచ్చబండ

సాక్షి, అమరావతి :  శ్రీనివాసరావు (పేరు మార్చాం) మాట్లాడుతూ... ‘వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు  కుల, మత, ప్రాంతం, వర్గ భేదాలు లేకుండా ఉద్యోగులను సొంత మనుషుల్లా చూసేవారు. కేంద్రం ప్రకటించిన నెలలోపు ఉద్యోగులకు డీఏలు, ఇతరత్రా అలవెన్సులు ఇచ్చేవారు. ఈ స్వేచ్ఛతో ఉద్యోగులు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించారు. వ్యవసాయంలో జాతీయ సగటును దాటి ఉత్పత్తి సాధించగలిగాం. మళ్లీ అటువంటి పాలన రావాలని ప్రతి ఉద్యోగి కోరుకుంటున్నాడు’ అని తన మనసులోని మాట చెప్పారు.

వెంకటేష్‌ (పేరు మార్చాం) స్పందిస్తూ.. ‘చంద్రబాబు పాలనంతా డీఏలను పెండింగ్‌లో పెట్టడమే సరిపోయింది. 2014 నుంచి ఇప్పటివరకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉంచారు. మళ్లీ ఆయనే వస్తే ఉద్యోగులకు డీఏ అవసరమా అంటారు. రద్దు చేస్తే ఎవరు అడుగుతారనే భావనకు వస్తారు. ఇంకా ఎలాంటి నిర్ణయాలను చూడాల్సి వస్తుందో’ అంటూ నిట్టూర్చారు. ‘అవును. హెల్త్‌కార్డుల సంగతేంటి. అవి కనీసం నాలుక గీసుకోవటానికి కూడా పనికి రావటం లేదండి. క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ అన్నారు. ఏ హాస్పిటల్‌కు వెళ్లినా మేం ట్రీట్‌మెంట్‌ చేయలేమంటూ చేతులు ఎత్తేస్తున్నారు.

పెన్షనర్ల పరిస్థితి ఐతే మరీ ఘోరం. వచ్చిపడే రోగాలకు వైద్యం చేయించుకోలేక నానా అగచాట్లు పడుతున్నారు’ అంటూ వెంకటేష్‌తో మాట కలిపారు సాయిరాం. ‘చెప్పటం మరచిపోయాను. సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు. దాని కోసం కమిటీ వేశారు. అది ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. అధికారంలోకి రాగానే  సీపీఎస్‌ రద్దు చేస్తానంటూ వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ప్రకటించారు. ఇచ్చిన మాటపై నిలబడే లక్షణం ఆ కుటుంబానికే ఉంది. కచ్చితంగా రద్దు చేస్తాడని ప్రతి ఉద్యోగి నమ్ముతున్నాడు. జగన్‌ రావాలి.. ఈ బాధలు పోవాలి ’ అంటూ రమేష్‌ చర్చను ముగించాడు. 

ఉద్యోగులకు ఇచ్చిన హామీలివీ 

  • కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రమబద్ధీకరణ చేయకుండా మోసం చేశారు. 
  • అన్ని ప్రాంతాల్లో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలంటూ ఎన్నికలు దగ్గరపడటంతో ఓ పాలసీ తయారు చేశారు. 
  • ఉద్యోగుల ఇంటి నిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణాలని చెప్పి ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. 
  • ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అమలులో ఘోరంగా విఫలమయ్యారు. లక్షల్లో ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ భర్తీ చేసింది చాలా తక్కువ. 
  • వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేస్తామన్నారు. ఈ విధానాన్ని కేవలం సచివాలయం, హెచ్‌ఓడీలలో మాత్రమే అమలు చేసి మిగిలిన వారికి చెయ్యిచ్చారు. 
  • ఉద్యోగులకు పదవీ విరమణ రోజే బెనిఫిట్స్‌ అందిస్తామన్నారు. అమలులో పూర్తిగా విఫలమయ్యారు. ఏళ్ల తరబడి తిరిగినా బెనిఫిట్స్‌ అందటం లేదు. 
  • పెన్షనర్లకు మెరుగైన క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ అమలు కాలేదు. సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి.   
మరిన్ని వార్తలు