అభ్యంతరం లేని రంగు వాడాలి: దాసోజు

24 Oct, 2018 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పోలింగ్‌ బూత్‌లకు అభ్యంతరం లేని రంగు వాడాలని కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌ కమిటీ కన్వీనర్‌ దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఈసీకి విజ్ఞప్తి చేశారు. మహిళా ఓటర్లను చైతన్య పరిచి, ఎన్నికల్లో వారి ఓట్ల శాతం పెంచే నెపంతో ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే కుట్ర పూరిత విధానానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.

మహిళల ఓటింగ్‌ శాతాన్ని పెంచడం మంచిదే అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా రంగు అయిన గులాబీని పోలింగ్‌ కేంద్రాలకు వాడటం సరికాదన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను తక్షణమే నిలిపే సి, అభ్యంతరం లేని మరో రంగును పోలింగ్‌ బూత్‌లకు వాడాలని దాసోజు కోరారు. పోలింగ్‌ బూత్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ రంగును వాడొద్దని ఇప్పటికే ఎన్నికల సంఘానికి విన్నవించామని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు.

పొత్తులపై కోర్‌ కమిటీకి ఉత్తమ్‌ నివేదన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా కూటమి పొత్తులపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పార్టీ కోర్‌ కమిటీలో కీలక నేత గులాం నబీ ఆజాద్‌కు ఇక్క డ నివేదించారు. మంగళవారం ఆజాద్‌తో సమావేశమైన ఉత్తమ్‌ ప్రజా కూటమిలో టీడీపీ, టీజే ఎస్, సీపీఐ కోరుతున్న సీట్ల సంఖ్యపై చర్చిం చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రజాకూటమి ముందుకు సాగడంలో టీడీపీ సయోధ్యతో ఉం దని, గెలిచే సీట్లపైనే ఆ పార్టీ దృష్టి సారించిందని తెలిపినట్లు సమాచారం. కోర్‌ కమిటీ ఈ పొత్తులను ఆమోదిస్తే తదుపరి అభ్యర్థుల జాబితా ప్రకటనపై, ప్రచారంపై దృష్టి పెట్టొచ్చని ఉత్తమ్‌ కోరినట్టు సమాచారం. కూటమి గెలుపునకు సానుకూల వాతావరణం ఏర్పడిందని, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఏడెనిమిది రోజుల పాటు ఇక్కడ ప్రచారంలో ఉండేలా చొరవ తీసుకోవాలని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

స్క్రీనింగ్‌ కమిటీతోనూ సమావేశం..
తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్త చరణ్‌దాస్‌తోనూ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతల అభిప్రాయాల సేకరణ అనంతరం సామాజిక వర్గాల కూర్పుపై ఉత్తమ్‌ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

కర్ణాటకం : సంకీర్ణ సర్కార్‌కు మరో షాక్‌

ఛీటింగ్‌ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ

కిషన్‌రెడ్డి పర్యటన.. ఫ్లెక్సీలు తగలబెట్టడంతో ఉద్రిక్తత

‘చంద్రబాబు కోటరీలో వణుకు మొదలైంది’

కత్తులు, రాడ్లతో స్వైర విహారం

చంద్రబాబు వైఫల్యంతోనే... 

‘కేసీఆర్‌ సారు, కేటీఆర్‌ సారు ఉండవు’

‘కొత్తగా సీఎం అయినట్లు మాట్లాడుతున్నారు’

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు

'ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమే'

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..

‘ఇప్పుడు వెళ్తున్నా.. త్వరలోనే మళ్లీ వస్తా’

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

‘ఎవరిని అడిగినా చెప్తారు.. తుగ్లక్‌ ఎవరో’

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్న పరువు కాస్తా పాయే..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

మున్సిపల్‌ చట్టం.. బీసీలకు నష్టం

కమలంలో కలహాలు...

ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది

పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి