పంట నష్టంపై పట్టించుకోరా: పొంగులేటి 

26 Apr, 2018 02:54 IST|Sakshi
ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అకాల వర్షాలతో రైతాంగం తీవ్ర నష్టంలో కూరుకుపోయి ఉంటే, వారికి పరిహారం ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉపనాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్కెట్‌ యార్డుల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, రైతులు పంటలను అమ్ముకునేందుకు రోజుల తరబడి కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ హౌజ్‌ కమిటీలు నామమాత్రంగా మారాయని, కమిటీ సమావేశాలపై అశ్రద్ధ సరికాదని, స్పీకర్, చైర్మన్‌లు కమిటీల పనితీరుపై దృష్టి సారించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు