‘ప్రగతి నివేదన’లో అన్నీ అబద్ధాలే: పొన్నం

4 Sep, 2018 03:36 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నీ అబద్ధాలే మాట్లాడారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ దగ్గర మోకరిల్లి ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్‌.. ఫెడరల్‌ ప్రంట్‌ పేరిట కొత్త నాటకానికి తెర తీశారన్నారు. ప్రధాని మోదీని కలిసినప్పుడల్లా వంగి నమస్కారాలు చేసిన ఆయన.. జోనల్‌పై ‘ఇస్తావా చస్తావా’ అని నిలదీశానంటే ఎవరు నమ్ముతారని ప్రభాకర్‌ ప్రశ్నించారు.

నిజంగా నువ్వు నిలదీసే వాడివైతే ముస్లిం మైనార్టీలు, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఎందుకు అడగడం లేదన్నారు. మిషన్‌ భగీరథపై సీఎం పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని, ఒకసారి 11 వందల గ్రామాలు అన్నింటికి ఇచ్చామంటారు.. మరోసారి 40 శాతమే పనులు జరిగాయి అంటున్నారని విమర్శించారు. ప్రగతి నివేదన సభలో కనీసం అమరుల పేరెత్తకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు