జూపల్లి.. ఇదే సరైన సమయం.. నిర్ణయం తీస్కో!

26 Jan, 2020 17:41 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ‘తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న జూపల్లి కృష్ణారావు పట్ల టీఆర్ఎస్ కార్యాలయంలో ఎదురైన అవమానం తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి తమతో కలిసి తెలంగాణ కోసం జూపల్లి ఉద్యమించారని, మంత్రి పదవికి రాజీనామా చేసి.. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్‌లో చేరారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు తన నియోజకవర్గంలో తానేంటో నిరూపించుకొని.. గెలిచివస్తే.. టీఆర్ఎస్ నేతలు ఆయనను అవమానించడం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. జూపల్లి తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునే సమయమిదేనని, ఇప్పటికైనా టీఆర్ఎస్‌ నుంచి బయటకొచ్చి ఆయన తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా