పేద ప్రజల ఓటుపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

25 Dec, 2017 12:54 IST|Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలోని ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలను ఓటు వినియోగాన్ని ఉద్దేశించి వెనుకబడిన వర్గాల సంక్షేమ, వికలాంగ సాధికారత  మంత్రి ఓం ప్రకాష్ రాజ్‌భార్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కోడి మాంసం, మందు ఇస్తే చాలు పేద ప్రజల ఓటు దక్కినట్టేనని ఓం ప్రకాశ్‌ అన్నారు. రాజకీయ పార్టీలకు ఓటు వేయడానికి పేద ప్రజలు ఆల్కహాల్‌ తీసుకుంటారని, చికెన్‌ తింటారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం పార్టీలు పేద ప్రజలకు ట్రీట్ ఏమీ ఇవ్వవని కానీ చికెన్‌ ఇస్తాయంటూ పేర్కొన్నారు.  

ఢిల్లీ, లక్నోల్లో ఆ మాదిరిగానే ప్రభుత్వాలు ఏర్పాటుచేశాయంటూ బాల్‌రామ్‌పూర్‌లో ఏర్పాటుచేసిన సభలో వివాదాస్పదంగా మాట్లాడారు. సుహెల్దవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు అయిన రాజ్‌భార్‌, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భాగస్వామ్యంలో యోగి ప్రభుత్వం మంత్రి పదవి దక్కించుకున్నారు. ఈ విధంగా మంత్రి అయిన రాజ్‌భార్‌ పేద ప్రజల ఓటు హక్కు వినియోగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మద్యాన్ని దుర్వినియోగ పరుస్తున్నారంటూ తన రాజ్‌భార్‌ కమ్యూనిటీ సభ్యులపై మంత్రి ఆరోపణలు గుప్పించిన నెల అనంతరం మళ్లీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 

మరిన్ని వార్తలు