‘రాధాకృష్ణా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో’

21 Mar, 2019 11:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళికి నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పోసాని స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాకు తెలియజేశారు. అయితే ఈ వార్తను ఏబీయన్‌ ఆంధ్రజ్యోతి వక్రీకరించి ప్రసారం చేసిందని పోసాని కృష్ణమురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అబద్ధాలు ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణపై పోసాని విరుచుకుపడ్డారు.

ప్రస్తుతం తాను రూపొందిస్తున్న సినిమాలో చంద్రబాబును అవమానించినట్టుగా టీడీపీ నాయకులు కంప్లయింట్ ఇచ్చారని ఈసీ, పోసానికి నోటీసులు పంపింది. అయితే పోసాని తన సినిమా ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాలేదని సినిమాలో ఏముందో ఎవరికీ తెలిసే అవకాశం లేదని, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కారణంగా స్వయంగా వచ్చి కలవలేకపోతున్నట్టుగా ఈసీకి సమాధానం ఇచ్చారు. తాను యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టుగా అందుకు సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్‌ను సైతం ఈసీకి పంపించానన్నారు.
(చదవండి : బాబు దొంగని ప్రజలకు తెలియదా! మళ్లీ సినిమా ఎందుకు?)

అయితే పోసాని, చంద్రబాబును కులం పేరుతో విమర్శించినందుకు ఈసీ నోటీసులు ఇచ్చినట్టుగా వార్తను వండి వార్చింది ఆంధ్రజ్యోతి. అంతేకాదు ఆంధ్రజ్యోతి లైవ్‌లో కుటుంబరావు, పోసాని ఆరోగ్యం బాలేనట్టుగా అబద్ధాలు చెప్తే అది పెద్ద నేరంగా పరిగణిస్తారంటూ చెప్పటంపై పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదన్న పోసాని.. అబద్దాలు చెప్పటం, మోసం చేయటం, వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నైజం అని విమర్శించారు.

అంతేకాదు చంద్రబాబుకు ఆయన పార్టీ నాయకులకు కులపిచ్చి ఉందని తాను చేసిన వ్యాఖ్యల విషయంలో వెనక్కి పోయేది లేదన్నారు పోసాని. అందుకు సాక్ష్యంగా గతంలో చంద్రబాబు ‘ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారు’ అన్న వ్యాఖ్యలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ‘ మీరు దళితులు, మీరు వెనకబడిన వారు, మాకు పదవులు, మీకెందుకురా’ అంటూ చేసిన వ్యాఖ్యల వీడియోలను చూపించారు.
(చదవండి : చంద్రబాబుపై పోసాని ఫైర్‌)
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా