జననేతపై అభిమానాన్ని చాటుకున్న పోసాని

24 May, 2019 10:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జననేత వైఎస్‌ జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం యావత్తు భారీ మద్దతు పలికారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మొదటి నుంచీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అభిమానాన్ని చాటుకునే దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి వైఎస్సార్‌సీపీ అఖండ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘వైఎస్‌ జగన్‌ సీఎం కావాలన్నది నా బలమైన కోరిక. ఆ కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన సీఎం కావాలని దేవుళ్లకు మొక్కుకున్నా. కోరిక నెరవేరడంతో అమీర్‌పేట్‌, బేగంపేట్‌, పిలింనగర్‌లోని ఆలయాల్లో దేవుళ్లకు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నా. ప్రజాతీర్పు చూసి చంద్రబాబులోపల మార్పు రావడం సంతోషం. జగన్‌పై తప్పుడు కేసులు బనాయించేలా చేసిన  చంద్రబాబు.. వాటిని ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు, మోసాలు మానేస్తే ఆయనకు పాదాభివందనం చేస్తా. జనరంజక పాలన చేసి మంచి పేరు తెచ్చుకొని.. జగన్‌ మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా. కేసీఆర్ సీఎం కావాలని కూడా గతంలో దేవుణ్ణి కోరుకున్నా. మొక్కులు తీర్చుకున్నా కష్టాల నుంచి పైకొచ్చిన నేను ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా ఉన్నా’ అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా