నేను జగన్‌ను కాదు...పోసాని కృష్ణమురళీని..

21 Mar, 2019 11:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణపై సినీనటుడు పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గురువారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తనకు వచ్చిన నోటీసులపై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలపై ధ్వజమెత్తారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ మానసిక రోగంతో బాధపడుతున్నారని, తనపై తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదని పోసాని హెచ్చరించారు. తన తప్పు ఉంటే బహిరంగంగా చెబితే... సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఎన్ని విమర్శలు చేసినా, తిట్టినా.. చిరునవ్వుతో సహించడానికి తాను వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కాదని....పోసాని కృష్ణమురళీని అని అన్నారు.  ఇకనైనా బుద్ది తెచ్చుకో.. సిగ్గు తెచ్చుకో రాధాకృష్ణా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చదవండి....(నా గురించి అబద్ధాలు రాస్తావా.. రాధాకృష్ణా బుద్ధి తెచ్చుకో)

ఆయన ఇంకా మాట్లాడుతూ... ‘రాధాకృష్ణ అన్నయ్య నువ్వంటే చాలా గౌరవం. గతంలో  ఎప్పుడో నువ్వు .. అక్షరం ఆయుధంగా మారుస్తానని రాశావు. అయితే నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా ఫరవాలేదు కానీ... ఆ అక్షరాన్ని వేశ్యగా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నాం. అబద్ధం చెప్పేవాడిని ఏమనాలి. లంగా...లోఫర్‌... దొంగా ...ఇంకా ఎక్కువే అనవచ్చు. మీడియా అంటే నువ్వు ఒక్కడవే కాదు. జర్నలిజం కోసం ప్రాణాలు అర్పించినవాళ్లు ఉన్నారు. చేతిలో మీడియా ఉంది కదా నువ్వు ఏమైనా చేసుకో. నాకు సంబంధం లేదు. చదవండి...(టీడీపీకి ఓటేస్తే రాష్ట్రం సర్వనాశనం)

అయితే నా జోలికి మాత్రం రావద్దు. నేను ఏమైనా  భూకబ్జాలు చేశానా?. బ్యాంకులు, ప్రభుత్వాలను మోసం చేశానా?. నా తప్పుంటే నిర్భయంగా చెప్పు.  అంతేకాని నేను అనని మాటలు అన్నట్లు రాస్తే ఊరుకోను. నేను తిట్లమెన్‌నే కాదు. నాలో డాబర్‌ మెన్‌ కూడా ఉన్నాడు. నీ బతుకు .... నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని, ఇకనుంచి అయినా మనిషిగా బతకడం నేర్చుకో. మీడియా అంటే పక్షపాతంతో వ్యవహరించకూడదు. అయితే రాధాకృష్ణ మాత్రం అధికార పక్షానికి మిత్రపక్షంగా ఉంటాడు. రాధాకృష్ణకు చంద్రబాబు ఇష్టమైతే కాళ్లు నాకవచ్చు. నేను అనని మాటలు అన్నానని తప్పుడు వార్తలు రాయొద్దు. నాపై రాధాకృష్ణ ఎందుకు తప్పుడు వార్తలు రాశాడు?. నా సినిమాను ప్రజల కోసమే తీశాను. ఎన్నికల కమిషన్‌ వారికి అనుకూలంగా సినిమా తీశాను.’  అని అన్నారు. 

మరిన్ని వార్తలు