ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం

5 Mar, 2018 08:55 IST|Sakshi

విజయవంతానికి కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు

విలేకరుల సమావేశంలో బాదం మాధవరెడ్డి  

తాళ్లూరు: దర్శి నియోజకవర్గంలోని తాళ్లూరు మండలంలో శని, ఆదివారాల్లో జరిగిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర విజయవంతమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి బాదం మాధవరెడ్డి పేర్కొన్నారు. తాళ్లూరులో ఆదివారం  మాజీ ఎంపీపీ ఇడమకంటి గురువారెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాళ్లూరులో బహిరంగ సభతో సహా ప్రజా సంకల్ప యాత్ర విజయవంతానికి కృషి చేసిన దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు బాదం కృతజ్ఞతలు తెలిపారు. తాళ్లూరు వెల్లంపల్లి బస్టాండ్‌లో జరిగిన బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు హాజరై అభిమానాన్ని చాటడం ఎప్పటికీ మరువలేనన్నారు. ప్రజా సంకల్ప యాత్ర ఏర్పాట్లను వారం నుంచి పర్యవేక్షించిన కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా తాళ్లూరు, కుంకుపాడు రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉన్న సమయంలో పాదయాత్ర కోసం చక్కగా రోడ్డు వేసిన వైస్‌ ఎంపీపీ రమావెంకటేశ్వరరెడ్డికి అభినందనలు తెలిపారు. సంకల్ప యాత్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఎండను సైతం లెక్కచేయకుండా బహిరంగ సభను విజయవంతం చేసిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.

దర్శి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు...
2019 సార్వత్రిక ఎన్నికల్లో తనను వైఎస్సార్‌ సీపీ దర్శి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసి బహిరంగ సభలో ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణ పడి ఉంటానని బాదం మాధవరెడ్డి పేర్కొన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ప్రజల మద్దతుతో ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.

కార్యక్రమంలో పార్టీ తాళ్లూరు, దర్శి, దొనకొండ మండలాల అధ్యక్షులు ఇడమకంటి వేణుగోపాల్‌రెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, కాకర్ల క్రిష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కుమ్మిత అంజిరెడ్డి, ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి,  ముండ్లమూరు మాజీ అధ్యక్షుడు సుంకర బ్రహ్మానందరెడ్డి, వైస్‌ ఎంపీపీ ఐ.రమావెంకటేశ్వరరెడ్డి, కోఆప్షన్‌ మెంబర్‌ వలి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్‌జీ వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, ఉప సర్పంచి బెల్లంకొండ శ్రీనివాసరావు, వల్లభనేని వీరయ్య చౌదరి, నారిపెద్ది రామ్మూర్తి, మాజీ సర్పంచి చింతా శ్రీనివాసరెడ్డి, మేడగం శ్రీనివాసరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు రామకోటిరెడ్డి, అంజిరెడ్డి, బీసీ ప్రధాన కార్యదర్శి బొల్లా వెంకటనర్సయ్య, తిరుపతయ్య, చెన్నారెడ్డి, బాదం రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాదంకు పలువురి అభినందనలు...  
2019 సాధారణ ఎన్నికలలో దర్శి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బాదం మాధవరెడ్డిని ఆ పార్టీ అ«ధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సందర్భంగా అధిక సంఖ్యలో నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. మాధవరం ఉప సర్పంచి బెల్లంకొండ శ్రీనివాసరావు, కార్యకర్తలు ఎదురు చంద్రశేఖర్‌రెడ్డి, ఎదురు శ్రీనివాసరెడ్డి, యార్తల యలమందారెడ్డి, తూము వెంకటేశ్వరరెడ్డి, మున్నేల్లి రఘనాథరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్‌ మహ్మద్‌ జానిలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. రజానగరం వైఎస్సార్‌ సీపీ సేవాదళం ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను బాదంకు వివరించారు. సేవా దళం సభ్యులు శాలువా కప్పి బాదంను సన్మానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు