‘ఆజాద్‌ వ్యాఖ్యలు విడ్డూరం’

15 Apr, 2018 18:58 IST|Sakshi
ప్రకాశ్‌ జవదేకర్

సాక్షి, ఢిల్లీ : కథువా హత్యాచార బాధితురాలికి న్యాయం జరగుతుందని.. దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్ అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులు బయటే ఉన్నారన్న గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రతి సమస్యను పెద్దది చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ హయాంలో అత్యాచార ఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. గులాం నబీ ఆజాద్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జమ్మూకాశ్మీర్‌ ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదనే బీజేపీ మంత్రులను రాజీనామా చేయించామని పేర్కొన్నారు.

కాగా‌, బీజేపీ ఆరోపనలను కాంగ్రెస్‌ గట్టిగా తిప్పికొట్టింది. సమస్యలను ఎత్తి చూపడం ప్రతిపక్షాల విధి అని కాంగ్రెస్‌ నాయకులు పవన్‌ ఖేరా అన్నారు. గత 14రోజుల వ్యవధిలో ఉత్తర్‌ప్రదేశ్‌,  జమ్మూ-కశ్మీర్‌లో మహిళలపై అత్యాచారాలు జరిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రతిపక్షాలు, సోషల్‌ మీడియా చొరవ చూపడంతోనే ప్రధాని స్పందించారన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు

>
మరిన్ని వార్తలు