కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

25 Jan, 2020 10:31 IST|Sakshi

ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయ నేతల్లో మరింత దూకుడు పెరిగింది.​ ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్ తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవరి 8న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయంటూ బీజేపీ నేత కమల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులిచ్చిన సంగతి మరువక ముందే ఢిల్లీ బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తోన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌లో ఏర్పాటు చేపిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడారు.  పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్‌లో డిసెంబర్‌ నుంచి నిరవధిక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ.. ఆ ఉద్యమం వెనుక చీకటి శక్తులు ఉన్నాయని, ఆ చీకటి శక్తులకు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు అండగా నిలిచాయని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. షాహీన్ బాగ్ లో నిరసనకారులు.. జిన్నా కోరిన స్వాతంత్ర్యం(జిన్నా వాలీ ఆజాదీ) అంటూ నినాదాలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జిన్నా కావాలో? భారతమాతకు జై అంటారో ఢిల్లీ ఓటర్లు నిర్ణయించుకోవాలని జవదేకర్‌ పేర్కొన్నారు.
(ఫిబ్రవరి 8న భారత్‌-పాక్‌ పోరు : కపిల్‌ మిశ్రా)


 

మరిన్ని వార్తలు