ఈసీ పనితీరు భేష్‌: విపక్షాలకు ప్రణబ్‌ చురకలు

21 May, 2019 12:43 IST|Sakshi

 ఎన్నికల సంఘంపై ప్రణబ్‌ ప్రశంసలు

ఈసీపై ఆరోపణలు సరికావు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల జల్లు కురిపంచారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని ఈసీని కొనియాడారు. విపక్షాలు ఎన్నికల సంఘాన్ని విమర్శించవద్దని ప్రణబ్‌ హితవుపలికారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో తొలి ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ నుంచి ప్రస్తుత కమిషనర్ల వరకు ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ఎన్నికల నిర్వహణ సంస్థలని, అవన్నీబాగా పనిచేస్తున్నాయని ప్రశంశించారు.

కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌తో పలు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీపై విమర్శలు చేస్తున్న నాయకులకు ఆయన చురకలంటించారు. చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవ పడతాడని, మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగిస్తాడని చలోక్తులు విసిరారు. ఈ నేపథ్యంలో ప్రణబ్‌ వ్యాఖ్యలు ఆపార్టీలో చర్చనీయాంశంగా మారాయి. దిల్లీలో సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం పనితీరుతో పాటు పలు సంస్కరణలపై మాట్లాడారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమావేశంలో ప్రణబ్‌ మాట్లాడుతూ.. ‘‘ సుదీర్ఘ కాలంలో రాజ్యాంగ సంస్థలు నిర్మించబడ్డాయి. తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటి వరకు ఎన్నికల సంఘం అద్భుతంగా ఎన్నికలను నిర్వహిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 67% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలో 2/3 ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల కమిషనర్లు అందరిని ప్రభుత్వాలే నియమిస్తూ వచ్చాయి.’’అని ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌