ఊహాగానాలకు ఈసీ తెరదించాలి

22 May, 2019 01:26 IST|Sakshi

ఈవీఎంల ట్యాంపరింగ్‌ వివాదంపై ప్రణబ్‌ ముఖర్జీ

పనికిమాలిన, నిరాధార ఆరోపణలన్న ఈసీ

ఈవీఎంలన్నీ భద్రమని వెల్లడి

లక్నో, న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపునకు మరో రెండురోజులు కూడా సమయంలేని నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలు మంగళవారం రాజకీయంగా దుమారం సృష్టించాయి. దీనిపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల తీర్పు తారుమారు వార్తలు తనను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు యంత్రాల (ఈవీఎంలు)ను చుట్టుముట్టిన ఊహాగానాలన్నిటికీ తెరదించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పైనే ఉందని ఆయన చెప్పారు. తమ అధీనంలో ఉన్న ఈవీఎంలకు రక్షణ, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈసీపైనే ఉందన్నారు. కాంగ్రెస్‌ మాజీ దిగ్గజ నేత కూడా అయిన ప్రణబ్‌ ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ప్రజా తీర్పు చాలా పవిత్రమైనదని, అది ఏ అతి చిన్న సందేహానికీ తావివ్వనంత ఉన్నతంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు సమర్ధంగా నిర్వహించినందుకు ఈసీని ప్రణబ్‌ సోమవారం అభినందించిన సంగతి తెలిసిందే.

విపక్షాల ఆందోళన
ఈవీఎంల తరలింపు, ట్యాంపరింగ్‌ ఆరోపణల సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం నిరసన ప్రదర్శనలకు దారితీసింది. కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ట్రాంగ్‌ రూముల్లో ఉన్న ఈవీఎంల తరలింపు ఫిర్యాదుల పరిష్కారం దిశగా ఈసీ తక్షణమే సరైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. విపక్షాలు ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడాన్ని బీజేపీ ఖండించింది. మళ్లీ మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా ఓటర్లు తీర్పు ఇచ్చిన పక్షంలో, ఓటమిని హుందాగా అంగీకరించాలని కోరింది.

ఘాటుగా స్పందించిన ఈసీ
పోలింగ్‌ సందర్భంగా ఉపయోగించిన ఈవీఎంల స్థానంలో వేరే ఈవీఎంలను ఉంచుతున్నారనే ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ స్పందించింది. అవన్నీ తప్పుడు, పనికిమాలిన, నిరాధార ఆరోపణలుగా పేర్కొంది.  ఏడు విడతల్లో వినియోగించిన ఈవీఎంలన్నీ స్ట్రాంగ్‌ రూముల్లో అత్యంత భద్రంగా ఉన్నాయని తెలిపింది. టీవీలు, సోషల్‌ మీడియాల్లో చూపిస్తున్న దృశ్యాలకు, పోలింగ్‌ సందర్భంగా వినియోగించిన ఈవీఎంలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారం చేపట్టనుందని దాదాపుగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ వెల్లడించిన సంగతి తెలిసిందే.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇది అందరి ప్రభుత్వం

‘జమిలి’పై భేటీకి మమత డుమ్మా

లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా

జూలైలో పుర ఎన్నికలు

ఆ జూట్‌ మిల్లును మళ్లీ తెరిచేందుకు కృషిచేస్తాం

ప్రభుత్వ సలహాదారుగా సజ్జల

కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం

పొగాకు రైతుల సమస్యలు పరిష్కరించండి

తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీలేదు: నామా

లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేతగా అధీర్‌ చౌదరి

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా

‘ప్రత్యేక హోదా ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్‌’

ప్రభుత్వ పత్రికా ప్రకటనలు ఇక సంస్కృతంలోనూ..

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత

మాకు ప్యాకేజీ వద్దు.. హోదా కావాలి : వైఎస్‌ జగన్‌

కేసీఆర్ దళితుల వ్యతిరేకి : మల్లురవి

లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణం

యనమల, జేసీ విసుర్లు

‘టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’

‘అభివృద్ధి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా​‍’

డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక

‘ఒకేసారి 3 వేలు ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు’

లోకేష్‌ రూ. 772 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు

ఓమ్‌ బిర్లాకు వైఎస్సార్‌సీపీ మద్దతు

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం

అప్పుడు చంద్రబాబు పట్టించుకోలేదు : అవంతి

చట్టసభల్లో ‘సింహ’గళం

ప్రతిపక్షంగా మంచి సూచనలు చేయండి

ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు

ఇది షాహిద్‌ సినిమా కాదు!

ప్రతి సీన్‌లో మెసేజ్‌

సంచలనాల ఫకీర్‌