బీజేపీ సర్కారు ఒప్పుకొని తీరాలి: ప్రియాంక గాంధీ

3 Sep, 2019 13:14 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆర్థిక మందగమనం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పినంత మాత్రాన అది నిజం కాబోదు. దేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలోనే పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని బీజేపీ సర్కారు ఇప్పటికైనా ఒప్పుకొని తీరాలి. ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గాలను వెతుకాలి’ అని ఆమె మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఆర్థిక మందగమనం ప్రతిచోటా కనిపిస్తోందని, అయినా మీడియాలో హెడ్‌లైన్స్‌ మేనేజ్‌ చేసుకుంటూ ఎంతకాలం వెళ్లదీస్తారని ఆమె ప్రశ్నించారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ నాయకుడు మన్మోహన్‌ సింగ్‌ కూడా ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మోదీ సర్కారు ఇప్పటికైనా కక్షసాధింపు రాజకీయాలు పక్కనబెట్టి.. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టే చర్యలు తీసుకోవాలని మన్మోహన్‌ సూచించారు.

మరిన్ని వార్తలు