బీజేపీపై నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ

24 Jul, 2019 10:21 IST|Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో బీజేపీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ‘ప్రతిదీ కొనలేం.. ప్రతి ఒక్కరిని బెదిరించలేం.. ప్రతి అబద్ధం బయటపడే రోజు తప్పక వస్తుంది.. త్వరలోనే బీజేపీ ఈ విషయాన్ని గ్రహిస్తుందని’ ప్రియాంక ట్వీట్‌ చేశారు. ‘ప్రజలు భరించినంత వరకే.. నాయకుల అంతులేని అవినీతి, ప్రజా ప్రయోజనాలను కాపాడే సంస్థలను నిర్వీర్యం చేయడం.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చడం వంటి అంశాలు కొనసాగుతాయి. ఒక్కసారి ప్రజల్లో సహనం నశిస్తే.. ఎంతటి నాయకుడైనా తుడిచిపెట్టుకుపోతా’డని మరో ట్వీట్‌ చేశారు ప్రియాంక గాంధీ.
 

దురాశ, స్వార్థ ప్రయోజనాలే గెలిచాయి: రాహుల్‌
కాగా, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దురాశ ముందు నిజాయతీ, ప్రజాస్వామ్యం, కర్ణాటక ప్రజల తీర్పు కుప్పకూలిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తమను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

మరిన్ని వార్తలు