డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని ధర్నా

15 May, 2018 09:21 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూ లక్ష్మి

అడ్డుకున్న పోలీసులు 

ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు

చిన్నకోడూరు(సిద్దిపేట) : తమకు జీవనాధారమైన భూములు లాక్కుని.. ఇతరులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించవద్దని నిర్వాసితులు ధర్నాకు దిగిన ఘటన సోమవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధి చెలుకపల్లి మధిర ఎల్లాయపల్లిలో జరిగింది. నిర్వాసితులు భూములలో టెంట్‌ వేసుకుని ధర్నాకు దిగారన్న విషయం తెలుసుకున్న చిన్నకోడూరు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసే ప్రయత్నం చేసారు.

దీంతో నిర్వాసితురాలు పల్మారు భూలక్ష్మి(62) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెను తమ వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆందోళనకారుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు