‘అధికార దాహంతో శివసేన’

23 Nov, 2019 13:17 IST|Sakshi

సాక్షి, విజయవాడ : శివసేన బీజేపీకి నమ్మకం ద్రోహం చేసిందని.. ప్రజల నమ్మకాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ నిలబెడతారని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడ్నవిస్‌కి శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్రలో సుపరిపాలన అందిస్తారని ప్రజలు మెజార్టీ సీట్లను బీజేపీకి కట్టబెట్టారని పరందేశ్వరి గుర్తుచేశారు. సోము వీర్రాజు మాట్లాడుతూ.. తన స్వరూపనికి భిన్నంగా శివసేన వ్యవహరించిందని మండిపడ్డారు. శివసేన అధికారదాహంతో కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపిందని విమర్శించారు. 

పొత్తుల కారణంగా మహారాష్ట్రలో బీజేపీకి సీట్లు తగ్గాయని ఆయన తెలిపారు. ప్రజలు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వీర్రాజు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ.. శివసేన అధికారదాహంతో నమ్మక ద్రోహానికి పాల్పడిందని దుయ్యబట్టారు. అద్భుతమైన పాలనను బీజేపీ మహారాష్ట్రలో అందిస్తుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఫడ్నవిస్‌ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు