ఇంటికొక ఉద్యోగం ఇచ్చేవరకు పోరు

5 May, 2018 01:30 IST|Sakshi

నిరుద్యోగుల సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌  

హైదరాబాద్‌: ఇటు తెలంగాణ ప్రభుత్వం.. అటు ఏపీ ప్రభుత్వం.. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి గద్దెనెక్కి, ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలని నినాదం ఇచ్చిన చంద్రబాబు తనకు, తన కుమారుడికి ఉద్యోగం తెచ్చుకుని నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. అలాగే కేసీఆర్‌ ఇంటికో ఉద్యోగం హామీ విస్మరించి జనం అడగని మిషన్‌ భగీరథ పేరుతో ఇంటికో నల్లా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇంటికో ఉద్యోగం ఇచ్చేవరకు పోరాటం చేయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్‌బీకే హాల్‌లో నిరుద్యోగ జాక్‌ చైర్మన్‌ నీల వెంకటేశ్, గుజ్జకృష్ణ అధ్యక్షతన జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అ«ధికారంలోకి వచ్చి నాలుగేళ్లైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలివ్వకుండా 14 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. 

మరిన్ని వార్తలు