‘చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి’

11 Jan, 2018 17:59 IST|Sakshi

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల కోసం నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు చేసిందేమి లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. రఘువీరారెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై ఎవరు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన కృషిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించి, పనులను ప్రారంభించింది వైఎస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌ తవ్వించిన కాల్వల ద్వారానే పట్టిసీమకు నీళ్లిచ్చారని వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం నేరంతో సమానమని పేర్కొన్నారు. తమ పార్టీపై చెబుతున్న అబద్ధాలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. 2019 నాటికి  పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు