‘వైఎస్సార్ సీపీ గెలుస్తుందనుకున్నా’

20 Aug, 2018 16:57 IST|Sakshi

సాక్షి, అనంతపురం: గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సైకిల్‌-హస్తం పొత్తుపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి స్పందించారు. సోమవారం స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండాలన్న దానిపై రాహుల్‌ గాంధీదే తుది నిర్ణయమని, అధిష్టానం ఆదేశిస్తే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్దమేనని రఘువీరా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తామని, ఏపీలో కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తున్నామని పునరుద్ఘాటించారు. 

వైఎస్సార్ సీపీ గెలుస్తుందనుకున్నా
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని 2014లో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని భావించామన్నారు. అయితే చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయని రఘువీరా అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కీలకపాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీ, బీజేపీ వైఫల్యాలపై కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేస్తామని రఘువీరా తెలిపారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు