వారిని తీసుకురండి: రాహుల్‌

15 Apr, 2020 14:50 IST|Sakshi
రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మధ్య ప్రాచ్య దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కోరారు. ప్రత్యేక విమానాలు పంపి వారిని వెనక్కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌-19 మహమ్మారి విజృంభణతో వ్యాణిజ్యం కుదేలవడంతో వేలాది మంది భారత కార్మికులు ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్నారని తెలిపారు.  వీరిని స్వదేశానికి తీసుకొచ్చి క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్రానికి రాహుల్‌ గాంధీ సూచించారు. 

కాగా, గల్ప్‌ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి రీత్యా గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన 87 లక్షల మంది భారతీయుల్లో 25 శాతం మంది ఉపాధి కోల్పోతారని అంచనా. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అనేక కంపెనీలు కార్యకలాపాలను నిలిపివేయడంతో భారత కార్మికుల ఉపాధికి గండి పడింది. మరోవైపు ముడిచమురు ధరలు మునుపెన్నడూ లేనంతగా పతనం కావడం అన్ని రంగాల్లోని ఉపాధిపై ప్రభావం చూపి కొలువుల కోతకు దారితీస్తోంది.

చదవండి: గల్ఫ్‌ కార్మికులపై ‘కరోనా’ పిడుగు

మరిన్ని వార్తలు