ఆ ఇద్దరికి రాహులే కరెక్ట్‌: అశోక్‌ గెహ్లాట్‌

11 Dec, 2019 16:11 IST|Sakshi

ముంబై: దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని ఢీకొట్టే సత్తా వాయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకే ఉందని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..మోదీ,షా ద్వయానికి సరైన ప్రత్యర్థి రాహుల్‌ గాంధీయేనని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైనప్పటికీ.. రాహుల్‌ గాంధీనే కాంగ్రెస్‌కు నాయకత్వం వహించాలని తాను ఆకాంక్షించానని తెలిపారు. దేశంలో కీలక సమస్యలైన రైతులు, ఉపాధి, నిరుద్యోగం, ద్రవ్యోల్భణంపైన రాహుల్‌ నిరంతరం పోరాడుతున్నారని కొనియాడారు. దేశ ప్రజల ముఖ్య సమస్యలపై పోరాడే కాంగ్రెస్‌ జాతీయవాద పార్టీ కాదా అని ప్రశ్నించాడు.

2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్‌ బీజేపీకి గట్టి పోటీనిచ్చిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. రాహుల్‌ లేవనెత్తిన ప్రజా సమస్యలను బీజేపీ సర్జికల్‌ స్ట్రైక్స్‌తో మభ్యపెట్టిందని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత మాత్రాన రఫేల్‌ కేసు మగిసినట్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు. రఫేల్‌ కేసు గురించి జేపీసీ నియమించడంలో బీజేపీ ఎందుకు వెనుకంజ వేస్తుందని నిలదీశారు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ప్రచారం చేసిన ఆర్టికల్‌ 370 రద్దును చూసి ఓటెయ్యలేదని అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. అందుకే ఈ ఎన్నికల తర్వాత బీజేపీ కాంగ్రెస్‌ ముక్త భారత్‌ నినాదాన్ని పక్కన పెట్టిందని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాలుగు నెలల్లోనే 4లక్షల ఉద్యోగాలు

ఒక రోజంతా మీతోనే ఉంటా: కేసీఆర్‌

గాంధీజీ కలలను సీఎం జగన్‌ సాకారం చేశారు

బచావత్‌ తీర్పు అర్థంకాకే టీడీపీ రాద్ధాంతం: బుగ్గన

పవన్‌కి నాకు మధ్యలో అడ్డంకి ఉంది : రాపాక

సీఎం జగన్‌  నిర్ణయానికి హ్యాట్సాఫ్‌: జేసీ దివాకర్‌

రాయలసీమ మళ్లీ కళకళలాడుతుంది

మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఈజ్‌ బ్యాక్‌

బాబును చూస్తే భయంగా ఉంది : ఎమ్మెల్యే

ఇంత దారుణమైన వక్రీకరణా?

‘చంద్రబాబును సస్పెండ్‌ చేయాల్సిందే’

ఇంగ్లిష్‌తో కాన్ఫిడెన్స్‌ లెవల్స్‌ పెరుగుతాయ్‌!

వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం : మంత్రి

ఇంగ్లిష్‌పై బాబుది దారుణమైన విధానం: సీఎం జగన్‌

ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి

నేడు గజ్వేల్‌లో కేసీఆర్‌ పర్యటన

బాబూ.. మీరు మాఫీ చేసిందెంత?

చతికిలబడ్డ ప్రతిపక్షం

‘త్వరలోనే రాష్ట్రానికి 2100 మెట్రిక్‌ టన్నుల ఉల్లి’

#CAB2019: మరోసారి ఆలోచించండి!

లోకేశ్‌ అమెరికా వెళ్లింది ఇందుకేనా? : రోజా

గిట్టుబాటు ధర ముందే ప్రకటిస్తాం : సీఎం జగన్‌

చంద్రబాబులా ప్రచారం చేసుకోలేదు

మూడు బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం

నిర్మల్‌ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌ ఒవైసీ

అందుకే ఆ బిల్లుకు మద్దతు: శివసేన

శవ రాజకీయాలు బాబుకు అలవాటే : సీఎం జగన్‌

నా వ్యాఖ్యలను వక్రీకరించారు : బొత్స

అనూహ్యం: అజిత్‌ పవార్‌, ఫడ్నవీస్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టైల్‌గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది’

విశాఖ నగరంలో తారక్‌

‘ప్రేమ అనేది అనుభూతి కంటే ఎక్కువ’

రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా ‘అర్జున్‌రెడ్డి’ భామ

ఫిలించాంబర్‌ ఎదుట హీరో ఆత్మహత్యాయత్నం

కాజల్‌కు వరుడు దొరికాడు