సరిహద్దు వివాదం.. కేంద్రం వర్సెస్‌ రాహుల్‌ గాంధీ

9 Jun, 2020 11:30 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీకి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాహుల్‌, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. లడాఖ్‌లో భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించుకున్నారా ఏంటి చెప్పాలి అని ప్రశ్నించారు. ‘రాజ్‌నాథ్‌ సింగ్‌ హస్తం గుర్తుపై కామెంట్‌ చేసిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారు. లడాఖ్‌లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందా ఏంటి’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. భారత్ - చైనా సరిహద్దుల్లో గత నెల రోజులుగా ఉద్రిక్త వాతావారణం నెలకొన్న సంగతి తెలిసిందే. చర్చల ద్వారా ఈ ప్రతిష్టంభనను ముగింపు పలకాలని ఇరుదేశాలు నిర్ణయించి, ఆ దిశగా ముందుకెళుతున్నాయి.
(డ్రాగన్‌ అంతపని చేసిందా..?)

ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ‘బిహార్ జన్‌సంవద్ వర్చువల్ ర్యాలీ’లో భాగంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. పుల్వామా, ఉరి ఉగ్రదాడుల తర్వాత సర్జికల్, ఎయిర్ స్ట్రయిక్స్ ద్వారా భారత్ రక్షణ విధానంపై బలమైన సందేశం పంపిందని, సరిహద్దులను ఎలా రక్షించుకోగలమో చెప్పిందన్నారు. ‘సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. హృదయాన్ని సంతోషంగా ఉంచడానికి మంచి ఆలోచన అవసరం’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రముఖ ఉర్దూ-పర్షియా కవి మీర్జా గలీబ్ రాసిన కవితను రాహుల్ తన ట్వీట్‌లో వాడారు. దీనిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. 20 వ శతాబ్దపు కవి మంజార్ లఖ్నవి రచించిన కవితను పోస్ట్‌ చేశారు. ‘చేతికి నొప్పి అయితే మందు తీసుకుంటాం.. కానీ చేయ్యే నొప్పికి కారణం అయితే ఏం చేస్తాం’ అంటూ ఓ కవితను ట్వీట్‌ చేశార. అయితే దీనిలో రాజ్‌నాథ్‌ సింగ్‌ 'హృదయం' ఉన్న చోట 'చేతి'ని మార్చి ట్వీట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు