కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ రాజీనామా..!

24 May, 2019 15:07 IST|Sakshi

ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ..రాజీనామా చేసే అవకాశం

రేపు సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా రాహుల్‌ గాంధీ పగ్గాలు చేపట్టిన అనంతరం ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే ఆ పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. రాహుల్‌తో పాటు సోనియా గాంధీ, కాంగ్రెస్‌ నేతలంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో బీజేపీ సునామీ ధాటికి హస్తం అభ్యర్థులు కొట్టుకుపోయారు. రాహుల్‌ నాయకత్వ పటిమకు పరీక్షగా నిలిచిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయన పూర్తిగా తేలిపోయారు. కనీసం ప్రత్యర్థికి పోటీ ఇవ్వకుండా బీజేపీ చరిత్రలోనే అత్యధిక స్థానాలకు ఆ పార్టీకి కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఒకవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ దారుణమైన ఓటమి చవిచూడడం మరోవైపు  ఆ పార్టీకి కంచుకోట వంటి  అమేథిలో రాహుల్‌ ఓడిపోవడం అధిష్టానం జీర్ణించుకోలేని అంశం. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకునేందుకు ఢిల్లీలో రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కానుంది. ఈ సమావేశంలోనే రాహుల్‌ రాజీనామా చేస్తారని తెలుస్తోంది. సమావేశంలో ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

కాగా రాహుల్‌ నాయకత్వంపై విమర్శలు రాకముందే.. పార్టీ పదవి నుంచి వైదొలగాలని రాహుల్‌, సోనియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికి సోనియా గాంధీ విముకత వ్యక్తం చేశారని, పదవికి రాజీనామా చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా రాహుల్‌ రాజీనామా వార్తలను ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తీవ్రంగా ఖండించారు. కాగా యూపీలో ఆపార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ రాజ్‌బబ్బర్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌