రాహుల్‌ గాంధీ నిపా వైరస్‌ లాంటి వ్యక్తి

30 May, 2018 05:00 IST|Sakshi

చండీగఢ్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిపా వైరస్‌ లాంటి వ్యక్తి అంటూ హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరికి వచ్చిన వారినందరినీ రాహుల్‌ నాశనం చేస్తాడని అనిల్‌ అన్నారు. ‘రాహుల్‌ నిపా వైరస్‌ లాంటి మనిషి. పార్టీని సర్వనాశనం చేస్తాడు. దగ్గరైన వారికీ పతనం తప్పదు’ అని అనిల్‌ అన్న మాటలను ఓ ప్రకటన రూపంలో హరియాణా ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. కాగా, అనిల్‌ విజ్‌ ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. గతంలోనూ తాజ్‌ మహల్‌ ఓ అందమైన సమాధి అనీ, మహాత్మాగాంధీ ప్రభావం వల్ల ఖాదీకి విలువ పెరగకపోగా, రూపాయి విలువ తగ్గిపోయిందని అనిల్‌ వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు