‘పార్టీ అధ్యక్షుడి ఎంపికలో జోక్యం చేసుకోను’

20 Jun, 2019 16:04 IST|Sakshi

న్యూఢిల్లీ : తాను కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్‌ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారని గురువారం విలేకరులు రాహుల్‌ను ప్రశ్నించారు. వీటిపై స్పందించిన రాహుల్‌.. కాంగ్రెస్‌ పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎంపికలో తాను జోక్యం చేసుకోవడం లేదని తెలిపారు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. పార్టీ దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) తిరస్కరించింది. అయిన కూడా రాహుల్‌ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి ఇష్టపడటం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గురువారం చేసిన వ్యాఖ్యలు చూస్తే రాహుల్‌ స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ పక్షనేతగా కొనసాగేందుకు కూడా రాహుల్‌ నిరాకరించారు. దీంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీనియర్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి ఆ బాధ్యతలు చేపట్టారు.  

మరిన్ని వార్తలు