ఏకలవ్యుడు అలా.. బీజేపీ ఇలా: రాహుల్‌

13 Jun, 2018 13:20 IST|Sakshi
రాహుల్‌ గాంధీ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా విమర్శనస్త్రాలను సంధించారు. ఏకలవ్యుడు గురువు ( ద్రోణాచార్యుడు ) కోరిక మేరకు తన వేలిని త్యాగం చేశాడని, కానీ ప్రధాని మోదీ మాత్రం అతని గురువులను దూరం పెట్టారని విమర్శించారు. రాహుల్‌ చేసిన ఈ వీడియో ట్వీట్‌ ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ట్వీట్‌కు క్యాప్షన్‌గా..‘ ఏకలవ్యుడు గురువు కోరిక మేరకు తన కుడి బొటన వేలిని త్యాగం చేశాడు. కానీ బీజేపీ మాత్రం తమ గురువులను దూరం పెట్టింది.  అటల్‌ బిహారీ వాజ్‌పెయ్‌, ఎల్‌కే అడ్వాణీ, జస్వంత్‌ సింగ్‌ వంటి అగ్రనేతలను వారి కుటుంబాలను అవమాన పరచడమే భారతీయ సంస్కృతి రక్షించడమని మోదీ భావిస్తున్నారు.’  అని రాహుల్‌  పేర్కొన్నాడు.

వ్యక్తిగత జీవితంలో గురువు స్థానం ఎంతగొప్పదో హిందూమతం చెబుతుందనీ, అలాంటిది ప్రధాని మోదీ ఏకంగా తన గురువు అడ్వాణీనే అవమానించారని ఇటీవల రాహుల్‌ ప్రధానిని విమర్శించిన విషయం తెలిసిందే. అధికారిక కార్యక్రమాల్లో ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదన్నారు. మంగళవారం ముంబైలో జరిగిన పార్టీ ర్యాలీలో రాహుల్‌ మాట్లాడుతూ.. ‘మోదీకి గురువు, మార్గదర్శకుడు  అడ్వాణీయే అని అందరికీ తెలుసు. అధికారిక కార్యక్రమాలప్పుడూ మోదీ ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదు. అటల్‌జీ దేశం కోసం పాటుపడ్డారు. ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా మొట్టమొదటిగా నేనే వెళ్లి పరామర్శించా’ అన్నారు.

మరిన్ని వార్తలు