సత్యపాల్‌ వ్యాఖ్యలకు రాహుల్‌ కౌంటర్‌

13 Aug, 2019 14:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ విభజన అనంతరం కశ్మీర్‌ లోయలో హింస పెరిగిపోయిందనే వార్తలొస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్ స్పందిస్తూ.. ‘కశ్మీర్ లోయను సందర్శించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ పంపుతా. వచ్చి.. ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోండి’ అని రాహుల్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. తాజాగా గవర్నర్‌ వ్యాఖ్యలపై రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. విమానం కాదు కావాల్సింది.. స్వేచ్ఛ అంటూ రాహుల్‌ మండి పడ్డారు.

‘డియర్‌ గవర్నర్‌ మీ ఆహ్వానం మేరకు నేను, ప్రతిపక్ష నేతలు జమ్మూకశ్మీర్‌, లదాఖ్‌లో పర్యటిస్తాం. అయితే మాకు కావాల్సింది ఎయిర్‌ క్రాఫ్ట్‌ కాదు... స్వేచ్ఛ. ప్రజలను కలిసి, వారితో స్వయంగా మాట్లాడే అవకాశం కల్పించండి చాలు’ అంటూ రాహుల్‌ తీవ్రంగా స్పందించారు.
 

మరిన్ని వార్తలు