ఆస్పత్రికి సోనియా; బీజేపీకి రాహుల్‌ చురక

28 May, 2018 10:56 IST|Sakshi
తల్లి సోనియాతో రాహుల్‌ గాంధీ(ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఈసారి అమ్మ సెంటిమెంట్‌తో కొట్టారు. విమర్శించడానికి అంతలా కష్టపడొద్దంటూ బీజేపీకి చురక అంటించారు. గతంలో సర్జరీ చేయించుకున్న సోనియా గాంధీ.. వార్షిక వైద్యపరీక్షల కోసం మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ సారి ఆమెను తనయుడే తోడ్కొనిపోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్‌ గాంధీనే వెల్లడించారు.

‘‘వార్షిక వైద్యపరీక్షల కోసం అమ్మను ఆస్పత్రికి తీసుకెళుతున్నాను. కాబట్టి కొన్ని రోజులు అందుబాటులో ఉండను. ఈ సందర్భంగా.. బీజేపీ ట్రోలింగ్‌ ఆర్మీకి నాదొక సూచన. నన్ను విమర్శించడానికి అంతగా కసరత్తు చేయాల్సిన అవసరంలేదు. అతి త్వరలోనే తిరిగొస్తాను’’ అని రాహుల్‌ రాసుకొచ్చారు. గతంలో చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లిపోవడం, ఎక్కడున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా రోజులకు రోజులు గడపడం లాంటివి రాహుల్‌ అలవాట్లుగా ఉండటం, ఆయా సందర్భాల్లో బీజేపీ పెద్ద ఎత్తున విమర్శల దాడి చేయడం తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి రాహుల్‌ తన విదేశీ పర్యటన వివరాలను ముందే వెల్లడించారు.

మాందసౌర్‌ కాల్పులకు ఏడాది: తల్లి సోనియాను తీసుకుని రాహుల్‌ ఒకటి రెండు రోజుల్లోనే విదేశాలకు బయలుదేరి వెళతారని, వారం రోజుల తర్వాత ఢిల్లీకి తిరిగొస్తారని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణకు సంబంధించి రాహుల్‌ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారని, విదేశాల నుంచి వచ్చిన వెంటనే రాహుల్‌ మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారని, మాంద్‌సౌర్‌ రైతులపై కాల్పుల ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్‌6న రైతు కుటుంబాలను రాహుల్‌ కలవనున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

సంకీర్ణ ప్రభుత్వానికి ఇక కష్టమే!

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

బ్రేకింగ్‌: కన్నడ సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

‘కిసాన్‌ సమ్మాన్‌’తో రైతులకు అవమానమే

కాళేశ్వరం.. తెలంగాణకు వరం

సిరా ఆరకముందే 80% హామీల అమలు

బెజవాడలో టీడీపీ నేతల సిగపట్లు

‘కాపు’ కాస్తాం

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

మంచి రోడ్లు కావాలంటే టోల్‌ ఫీజు కట్టాల్సిందే 

బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు

జయప్రద వర్సెస్‌ డింపుల్!

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?