‘థ్యాంక్స్‌ శంకర్‌.. మోదీని బాగా వెనుకేసుకొచ్చారు’

1 Oct, 2019 12:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌’  వ్యాఖ్యల పట్ల విదేశాంగమంత్రి ఎస్‌ శంకర్‌ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యంగ్యంగా స్పందించారు. ‘శంకర్‌ గారు మీకు ధన్యవాదాలు. ప్రధాని మోదీ అసమర్థతను బాగా కప్పిపుచ్చుకొచ్చారు. ట్రంప్‌ అభ్యర్థిత్వానికి మోదీ మద్దతు పలికి భారత విదేశాంగ విధానాన్ని ఉల్లంఘించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య భారతానికి సమస్యలు తెచ్చేలా ఉన్నాయి. భారత దౌత్యం గురించి మోదీకి మీరైన కొంచెం​ చెప్పండి’  అంటూ రాహుల్‌ ట్విట్‌ చేశారు.

(చదవండి : భారత్‌కు ట్రంప్‌ నిజమైన ఫ్రెండ్‌

హ్యూస్టన్‌ నగరంలో ఇటీవల జరిగిన ‘హౌడీ మోదీ’  కార్యక్రమంలో ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌ వేదిక పంచుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్‌ని పరిచయం చేస్తూ.. ‘ట్రంప్‌ భారత్‌ సత్సంబాలు కొనసాగిస్తోంది. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ మరో సారి అధికారంలోకి రావాలి (అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌) కోరుకుంటున్నాను’ అని మోదీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. మోదీ.. ట్రంప్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలికి భారత విదేశాంగ విధానికి ఉల్లంగించారని ఆరోపించారు. దీని వల్ల భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య బంధం దెబ్బతినే అవకాశం ఉందని విమర్శించారు.

అయితే  మోదీ వ్యాఖ్యలను మంత్రి జైశంకర్‌ సమర్థించారు. మోదీ ట్రంప్‌కు మద్దతు పలకలేదన్నారు. అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అంటున్న ట్రంప్‌.. అధ్యక్ష అభ్యర్థిగాను ఇండియన్‌ అమెరికన్లతో బంధాన్ని కోరుకుంటున్నట్లు తనకు అర్థమవుతుందని మాత్రమే మోదీ అన్నారని, అంతే కానీ మద్దతు ఇవ్వలేదని విరణ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా