వాళ్లంతా నకిలీ గాంధీలు

16 Dec, 2019 08:53 IST|Sakshi

బెంగళూరు: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ‘సావర్కర్‌’ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శల దాడి కొనసాగుతోంది. రాహుల్, ఆయన కుటుంబీ కులంతా ఉత్తుత్తి గాంధీలంటూ కేంద్ర మంత్రి ప్రల్‌హాద్‌ జోషి ఎద్దేవా చేశారు. లౌకికవాదులుగా చెప్పుకునే కాంగ్రెస్‌ తదితర పార్టీలు దేశంలో అశాంతి సృష్టించేందుకు పౌరసత్వ(సవరణ)చట్టాన్ని వాడుకుంటున్నా యని కర్ణాటకలోని హుబ్బళిలో ఆదివారం ఆయన మీడియాతో అన్నారు. ‘మీరు కావాలనుకుంటే ఎవరితోనైనా సయోధ్య కుదుర్చుకుంటారు. రాహుల్‌ ఉద్ధవ్‌ ఠాక్రేగా కూడా మీరు కాగలరు. గతంలో ఉద్ధవ్‌ ఠాక్రేకు వ్యతిరేకంగా మీరు చేసిన పనులు, ఆరోపణలు అందరికీ తెలుసు. సావర్కర్‌ వంటి దేశభక్తుడిపై విమర్శలు చేయడం చూస్తే మీరెంత అసహనంతో ఉన్నారో తెలుస్తుంది. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా..వీళ్లంతా నకిలీ గాంధీలు. వీరు మాత్రమే ఇతరుల గురించి ద్వేషంతో మాట్లాడగలరు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

‘దేశంలో హింసను ప్రేరేపించడానికి లౌకికవాదులమని చెప్పుకునే కాంగ్రెస్‌ వంటి పార్టీలు పౌరసత్వ చట్టాన్ని హిందు–ముస్లిం అంశంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నాయి’ అని ఆరోపించారు. గతంలో ఉగాండా, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన వారితోపాటు శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు సైతం పౌరసత్వం ఇచ్చామన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో 550 మంది మైనారిటీ వలసదారులకు పౌరసత్వం కల్పించామన్నారు. (రాహుల్‌ గాంధీని పబ్లిక్‌లో కొట్టాలి..)

మరిన్ని వార్తలు