మోదీ పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి : రాహుల్‌

11 Dec, 2018 20:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించామని, మోదీ పాలనపై రైతులు, నిరుద్యోగులు, మహిళలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ  అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు రాహుల్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈవీఎంలపై ప్రపంచవ్యాప్తంగా  అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంలో అమర్చే చిప్‌తో  ఫలితాలను తారుమారు చేయవచ్చన్నారు.

మోదీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, యువతకు ఉపాధి కల్పించాల్సి ఉందన్నారు. బీజేపీ ఇచ్చిన కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ పిలుపును రాహుల్‌ తప్పుపట్టారు. దేశం నుంచీ ఏ పార్టీనీ తరిమేయాలని తాము భావించడం లేదన్నారు. తెలంగాణ, మిజోరంలో తమ పార్టీ ఓటమి పాలైందని, మార్పు కోసం పనిచేస్తామని చెప్పారు.

రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌లో సాధారణ మెజారిటీ సాధించిన కాంగ్రెస్‌ మధ్యప్రదేశ్‌లో మేజిక్‌ మార్క్‌కు చేరువైంది. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీ తోడ్పాటుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ సన్నాహాలు చేస్తోంది. బీఎస్పీ అధినేత్రి మాయావతితో మధ్యప్రదేశ్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ ఫోన్‌లో మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరిన్ని వార్తలు