రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ రైలు రోకోలు

11 Apr, 2018 11:46 IST|Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: ప్రత్యేక హోదా పోరు ఉధృత రూపం దాల్చింది. హోదా సాధనే ధ్యేయంగా ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్సార్‌సీపీ నేతలకు సంఘీభావంగా బుధవారం ఉదయం నుంచే వైఎస్సారీపీ శ్రేణులు రైల్‌ రోకో చేపట్టాయి. అన్నిజిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిన్న జాతీయ రహదారులను దిగ్బంధించిన సంగతి తెల్సిందే. మంగళవారం ఎక్కడికక్కడ రహదారులపై మానవహారాలు, వంటావార్పు, భిక్షాటన, బైక్‌ ర్యాలీలు తదితర రూపాల్లో తమ నిరసన తెలియజేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రైలు రోకోకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని కొంతమందిని చెదరగొట్టారు. ఏపీలో రైల్వేస్టేషన్లు ప్రత్యేక హోదా నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి.

అనంతపురం జిల్లా 
ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు రైల్ రోకోలో పాల్గొన్నాయి. గుంతకల్లు వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్ది ఆధ్వర్యంలో గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో కర్నాటక ఎక్స్‌ప్రెస్ నిలివేత. అరగంట పాటు రైలు నిలిపి నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ నేతలు.  అలాగే అనంతపురం, గుత్తి రైల్వేస్టేషన్లలో కూడా రైల్ రోకో నిర్వహించారు.

  •  అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. పూలే విగ్రహానికి నివాళి అర్పించిన  ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి, అనంతపురం సమన్వయకర్త నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం.
  •  వైఎస్సార్సీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా ఉరవకొండలో ఐదోరోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు.
  • ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఏపీ భవన్ లో వైస్సార్సీసీపీ ఎంపీలు చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా గుంతకల్లు నియోజకవర్గ సమన్వయ కర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గుత్తిలో రైల్ రోకో. చెన్నైనుంచి ముంబై వెళ్తున్న రైలును అడ్డుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు. ఆందోళన కారులను చెదరగొట్టిన రైల్వే పోలీసులు. ప్రత్యేక హోదా నినాదాలతో గుత్తి రైల్వే స్టేషన్ను వైఎస్సార్సీపీ కార్యకర్తలు హోరెత్తించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసిన నినాదాలతో రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు విద్యార్థి సంఘాలు , ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

చిత్తూరు జిల్లా

  • రేణిగుంట రైల్వే స్టేషన్‌ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన రైల్‌ రోకో ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్సార్సీపీనేత భూమన కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌కు భారీగా చేరుకున్న శ్రేణులు ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు. రైళ్లను వెళ్లకుండా పట్టాలపై పడుకుని తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో రైల్వే పోలీసులు సంఘటానాస్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్నవారిని నిలువరించారు.

నెల్లూరు జిల్లా

  •  ప్రత్యేక హోదా కోరుతూ ఆమరణ దీక్షకు దిగిన ఎంపీలకు మద్ధతుగా వెంకటగిరిలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు రైల్ రోకోకు దిగారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఢిల్లీ బాబు, నెమల్లపూడి సురేశ్ రెడ్డి, చిట్టెటి హరి కృష్ణ, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
  • నెల్లూరులో వైఎస్సార్సీప చేపట్టిన రైల్‌రోకోను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, కార్యకర్తలు స్టేషన్‌ బయటికి వచ్చి రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.

పశ్చిమ గోదావరి జిల్లా

  •   ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలుపుతూ తాడేపల్లిగూడెంలోని పోలీసు ఐల్యాండ్ వద్ద తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
  • ప్రత్యేక హోదాసాధనకై రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్ధతుగా నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో నరసాపురం అంబేద్కర్ సెంటర్లో  చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి.
  •  పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం వైస్సార్సీపీ ఎంపీల ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి.
  • ఎంపీల దీక్షకు మద్ధతుగా ఏలూరు పవర్‌పేట్‌ రైల్వే స్టేషన్‌ వద్ద చేపట్టిన రైల్‌రోకోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్‌ రోకో చేస్తోన్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, నాయకులు రైల్వే స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. ఆందోళనకారులను బలవంతంగా పోలీసులు ఈడ్చుకెళ్లారు. అనంతరం అరెస్ట్‌ చేసి ఏలూరు టూటౌన్‌, త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ ఆళ్లనాని, సమన్వయకర్తలు తెల్లంబాలరాజు, ఎలీజా, మధ్యాహ్నాపు ఈశ్వరి, కొఠారు రామచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్‌, కార్యకర్తలు తదీతరులు పాల్గొన్నారు.
  • వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతుగా వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో భీమవరంలో రైల్‌రోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం పార్లమెంటు అధ్యక్షుడు ముదినూరి ప్రసాద్‌ రాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, కొట్టు సత్యానారాయణ, గుణ్ణం నాగబాబు, పీవీఎల్‌ నరసింహరాజు, కవురు శ్రీనివాస్‌, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  •  వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతుగా పార్టీ సమన్వయకర్త మేరగ మురళీధర్‌ ఆధ్వర్యంలో గూడూరులో రైల్‌రోకో నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రైల్వే స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా

  •   వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న రాజమండ్రి రూరల్‌ నియోజక వర్గ సమన్వయ కర్త గిరిజాల బాబు ఆరోగ్యం క్షీణించింది.
  • రాజమండ్రిలో రైల్వేస్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు రైల్‌ రోకో నిర్వహించారు. సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ నేతలు. ఈ కార్యక్రమంలో మోషెన్‌రాజు, కందుల దుర్గేష్‌; రౌతు సూర్య ప్రకాశ్‌ రావు, జక్కంపూడి విజయలక్ష్మి, తానేటి వనిత, కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • సామర్లకోట రైల్వేస్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు రైల్‌రోకో నిర్వహించారు. సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి నిరసన వ్యక్తం చేసిన నేతలు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం కోఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు, పిఠాపురం కోఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, జగ్గంపేట కోఆర్డినేటర్‌ ముత్యాల శ్రీనివాస్‌,తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా

  • ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతుగా విస్సన్నపేట మండల పార్టీ కన్వీనర్ భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఎంపీపీ భూక్యా రాణి, నెక్కళపు కుటుంబరావు, వైస్ ఎంపీపీ దుర్గారావు, డి.సిరసాని ప్రకాష్, జాఫర్ బాబా, సీతా రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
  •  వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావుపూలె జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జంగా కృష్ణ మూర్తి, ఎమ్మెల్యే రక్షణ నిథి, మాజీ ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, మల్లాది విష్ణు, పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌, కార్పొరేటర్లు, తదీతరులు పాల్గొన్నారు.అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా చేపట్టిన ఆందోళనల్లో వీరు పాల్గొన్నారు.

 
వైఎస్సార్‌​ జిల్లా

  • రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా బద్వేలులో ఎంఎల్‌సీ డీసీ గోవింద రెడ్డి, పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆధ్వర్య౦లో ఐదవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు.  ఈ దీక్షలో బ్రాహ్మణ పల్లె సింగిల్ వి౦డో అధ్యక్షుడు సు౦దర్ రామిరెడ్డి, మాజీ కౌన్సిలర్ చెన్నయ్య, నాగేశ్వరరావు, ప్రభాకర్, సాంబశివా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  •  పోరుమామిళ్లలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి. దీక్షలో కూర్చున్న బి.కోడూరు మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు.
  • కమలాపురంలో ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ప్రొద్దుటూరు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి. అనంతరం  101 టెంకాయలు  కొట్టిన వైఎస్సార్‌సీపీ నేత శివ చంద్రారెడ్డి
  •  జ్యోతిరావు పూలే 192వ జయంతి సందర్భంగా రాజంపేట మానసిక వికలాంగుల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేకు కట్ చేసి పిల్లలకు పంచిన జిల్లా బీసీ సెల్ కన్వీనర్ పసుపులేటి సుధాకర్, పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, పార్టీ నేతలు.
  • ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన లింగాల మండలం నాయకులు, పులివెందుల వడ్డెర, రజక, బుడబుక్కల సంఘం నాయకులు .
  •  ఆమరణ నిరాహారదీక్షకు మద్దతుగా రైల్వేకోడూరు గాంధీ విగ్రహం వద్ద చిట్వేలు మండల కన్వీనర్  చెవు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యాకర్తలు.
  • రాయచోటి లో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదోరోజుకు చేరిన వైఎస్సార్సీపీ శ్రేణుల రిలే దీక్షలు. పాల్గోన్న రాయచోటి రూరల్ మండలం ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు.
  • కడప రైల్వే స్టేషన్‌లో రైల్‌ రోకో కార్యక్రమం ఉండటంతో ముందస్తుగా పోలీసులను భారీగా మోహరించారు. రైల్‌ రోకో కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు స్టేషన్‌కు చేరుకున్నాయి. దీంతో పోలీసులు అడ్డుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. కడప రైల్వేస్టేషన్‌లో దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్‌ రెడ్డి, అంజద్‌ పాషా, రఘురామి రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌ రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రకాశం జిల్లా

  • వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్ధతుగా ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో రైల్‌ రోకో నిర్వహించారు. నాందేడ్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు. రైల్‌రోకో చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. బాలినేనిని బలవంతంగా పోలీసులు బయటకు లాక్కొచ్చారు. కొండెపి ఇంఛార్జి, దళిత నేత వరికూటి అశోక్‌ బాబుపై సీఐ గంగా వెంకటేశ్వర్లు దాడికి దిగారు. బాగా చితకబాది లారీలో పడేశారు. దీంతో దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని కార్యకర్తలతో కలసి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి నిరసనకు దిగారు.

కర్నూలు జిల్లా

  • కర్నూలు రైల్వేస్టేషన్‌ వద్ద కూడా రైల్‌రోకో సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో కలిసి రైల్‌రోకో చేసేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నేతలు బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్‌, ప్రదీప్‌రెడ్డిలను స్టేషన్‌ వద్ద పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు.
  • నంద్యాల రైల్వేస్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు రైల్‌ రోకోకు దిగారు.  కార్యర్తలను పోలీసులు అడ్డుకుని దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

విశాఖపట్నం జిల్లా

  • ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్షకు చేస్తోన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్ధతుగా నర్సీపట్నం ఆర్డీవో ఆఫీసు వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరంపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. దాడి జరిగిన విషయం పోలీసులకు చేరవేసినా వారు పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.
  • విశాఖ రైల్వేస్టేషన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రైల్‌రోకో నిర్వహించారు. పలాస ప్యాసింజర్‌ను నిలిపేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా నినాదాలతో స్టేషన్‌ ప్రాంగణమంతా దద్ధరిల్లింది. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు గుడివాడ అమర్నాథ్‌, సైనాల విజయ్‌ కుమార్‌, మళ్ల విజయ ప్రసాద్‌, చెట్టిఫాల్గుణ, కుంభా రవిబాబు, ఉషాకిరణ్‌, గరికిన గౌరి, వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా

  • ఆముదాలవలస రైల్వేస్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు రైల్‌రోకో నిర్వహించారు. భువనేశ్వర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి వైఎస్సార్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ రైల్‌రోకోలో తమ్మినేని సీతారం, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్‌ తదితర నేతలు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు