'కేసీఆర్‌ ఒక అబద్దాల పుట్ట'

18 Jan, 2020 15:19 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి మత్తు తెలంగాణ, అప్పుల తెలంగాణగా తయారు చేశారని ఎమ్మెల్యే రాజా సింగ్‌ విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్‌లో శనివారం నిర్వహించిన రోడ్‌ షోలో రాజాసింగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ..  కేసీఆర్‌ ఒక అబద్దాల పుట్ట అని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులను కేంద్రం ఇస్తామన్నా సీఎం ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. అయినా కేసీఆర్‌కు భయపడడానికి తమది కాంగ్రెస్‌ పార్టీ కాదని హెచ్చరించారు. నిజామాబాద్‌ పేరును తిరిగి ఇందూరుగా మార్చుకోవాలని, నిజామాబాద్‌ మున్సిపల్‌ మేయర్‌ పదవిని బీజేపీ సాధించాలని పేర్కొన్నారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీకి జాతీయత భావం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. దేశంలో జాతీయత భావం సాధించిపెట్టిన ఘనత మోదీ, అమిత్‌ షాలదేనని పేర్కొన్నారు. సీఏఏ, ఎన్నార్సీ వల్ల దేశంలోని ముస్లింలకు ఏ ఇబ్బంది ఉండదని, ముస్లింలంతా మా అన్నదమ్ములని రాజాసింగ్‌ వెల్లడించారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు